కిడ్నీలు పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారం తప్పనిసరి!

0
564

మన శరీరంలోని ప్రతి అవయవానికి ఎంతో ప్రాధాన్యత ఈ క్రమంలోనే మన శరీరంలోని వ్యర్థపదార్థాలను, మలినాలను బయటికి పంపడంలో మూత్రపిండాలు కీలక పాత్ర వహిస్తాయి.అయితే మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా మనం ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఉండే లవణాలు మరియు ఖనిజాల యొక్క కాల్షియం ఆక్సలేట్ అనే పదార్థం ఘన రూపంలోకి మారి గట్టి రాళ్ళలాగా మారుతాయి.ఈ రాళ్ళు మూత్రపిండాల నుంచి నుండి మూత్రాశయంలోకి ప్రవేశించిన తర్వాత మూత్రాశయానికి అడ్డుపడి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటివి తలెత్తుతాయి. ఫలితంగా అనేక రకాల కిడ్నీ వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.

కిడ్నీ సమస్యలను అధిగమించడానికి ప్రతి రోజూ మన ఆహారంలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియమ్, ఫైబర్, ఫొలెట్ సమృద్ధిగా ఉండే ఆపిల్, పనస, ముల్లంగి, క్యాప్సికమ్‌,పాలకూర, క్యాలీఫ్లవర్,వెల్లుల్లి వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. దానిమ్మ రసాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

ముఖ్యంగా కిడ్నీ పనితీరు పై ప్రతికూల ప్రభావం చూపే సోడియం, పొటాషియమ్, పాస్పరస్ తక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.ప్రతిరోజు అల్పాహారం ముందు ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం వల్ల నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో ఉండే క్యాల్షియం స్టోన్ ను సమర్థవంతంగా కరిగించి బయటకు పంపిస్తుంది. ప్రతిరోజు ఎక్కువ నీటిని తాగడం వల్ల కిడ్నీలో పేరుకుపోయిన మలినాలు మూత్ర రూపంలో బయటకు వచ్చి పనితీరు మెరుగుపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here