డిగ్రీ పాసైన వాళ్లకు శుభవార్త.. రూ.56,000 వేతనంతో ఉద్యోగాలు..!

0
181

కరోనా విజృంభణ వల్ల ప్రతి సంవత్సరం మే నెలలో ఉద్యోగాలకు విడుదలయ్యే నోటిఫికేషన్లు ఈ సంవత్సరం ఆలస్యంగా విడుదలవుతున్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలకు ఇప్పటికే ఒక నోటిఫికేషన్ విడుదల కాగా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కాగా ఎంపికైన వారికి ఏకంగా 56,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా జనరల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోకూడదు. డిసెంబర్ నెల 21వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 27 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.joinindiancoastguard.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2021 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అడ్మిట్ కార్డ్ లను పొందవచ్చు. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఏప్రిల్ నెల వరకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ పరీక్షలు జరుగుతాయి. చెన్నై, నోయిడా, కోల్ కతా, ముంబై లలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. 33 సంవత్సరాల లోపు ఓబీసీ అభ్యర్థులు, 35 సంవత్సరాల లోపు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ కనీసం 60 శాతం ఉత్తీర్ణతతో పాసైన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి అర్హత ఉన్నవాళ్లకు జనవరిలో ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here