Indira Devi: ఒకప్పటి అగ్ర హీరో అయినా కృష్ణ సతీమణి ఇందిరా దేవి గురించి మనందరికీ తెలిసిందే. ఈమె మహేష్ బాబు తల్లి అన్న విషయం కూడా తెలిసిందే. మహేష్ బాబుకి ఇందిరాదేవి అంతే ప్రాణం అని చెప్పవచ్చు. కాగా ఇప్పటికే పలుసార్లు స్టేజ్ పై తన తల్లి గురించి మాట్లాడినప్పుడు మహేష్ బాబు ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవలే మహేష్ బాబు తల్లి ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వినిపించాయి.

గత కొద్ది రోజులుగా అనారోగ్యాలు సమస్యలతో బాధపడుతున్న ఇందిరా దేవి తాజాగా ఆ పరిస్థితి మరింత విషమించడంతో ఆమె ఎమర్జెన్సీ వార్డ్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటోంది. అయితే తాజాగా అందులో సమాచారం ప్రకారం ఆమె కొద్దిసేపటి క్రితం ఇంట్లోనే తుది శ్వాస విడిచింది. దీంతో ఒక్కసారిగా మహేష్ బాబు ఇంట్లో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
ఈ వార్త తెలిసిన పలువురు ఘట్టమనేని అభిమానులు ఇందిరా దేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య అన్న విషయం తెలిసిందే. దంపతులకు మహేష్ బాబు, రమేష్,మంజుల జన్మించారు. కాగా కృష్ణ రెండవ భార్య అయిన విజయనిర్మల 2019లో మరణించిన సంగతి తెలిసిందే.

Indira Devi: కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవీ మృతి..
ఇందిరా దేవి మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ ఇందిరా దేవిని 1961 లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం కృష్ణ విజయనిర్మలను 1969 లో రెండవ పెళ్లి చేసుకున్నారు. కరోనా సమయంలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా అతను అన్న ను కడసారి కూడా చూడలేకపోయారు మహేష్ బాబు. అయితే ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే ఘట్టమనేని ఫ్యామిలీ కోరుకుంటుండగా ఇంతలోనే ఇందిరా దేవి ఆరోగ్యం సీరియస్ కావడం ఆమె మరణించడంతో ఒకసారిగా ఘట్టమనేని ఫ్యామిలీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.































