సాధారణంగా ఈ భూమిపై వాతావరణంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి.ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా కొన్ని ప్రాంతాలలో చలిగా ఉంటే మరికొన్ని ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు ఉంటాయి. ఈ విధంగా ఈ భూమిపై ఎన్నో అద్భుతాలు, వింతలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ విధంగా జరిగే వింతలు విన్నప్పుడు మనకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి ఆశ్చర్యకర ఘటనే ఇది.

సాధారణంగా మన భూమిపై వర్షపాతం అనేది నమోదవడం సర్వసాధారణం. అయితే ఈ భూమి పై ఎప్పటికీ వర్షం పడని ఒక వింత గ్రామం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా వేసిన ఇది నిజం. ఈ గ్రామంలో ఏడాది పొడవునా ఎప్పుడు వర్షం కురవదు. అందుకోసమే ఈ వింత గ్రామాన్ని చూడడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తుంటారు.
ఇప్పటివరకు మనదేశంలో మేఘాలయాలోని మాసిన్రామ్ అనే గ్రామంలో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుంది. కానీ యుమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉన్న ఆల్ హుతైబ్ అనే గ్రామంలో ఎప్పుడు వర్షాలు కురవవు. ఎందుకంటే ఈ గ్రామం భూ ఉపరితలానికి ఏకంగా 3,200 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల ఈ గ్రామంలో ఏడాది పొడవునా వర్షాలు కురవవు.
ఈ విధంగా వర్షం కురవని ఈ వింత గ్రామానికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ గ్రామంలో పురాతన నిర్మాణాలతో పాటు ఆధునిక నిర్మాణాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ గ్రామం భూ ఉపరితలానికి చాలా ఎత్తులో అంటే మేఘాల కన్నా పైన ఉండటం వల్ల ఈ గ్రామంపై వర్షం పడదు. కానీ ఈ గ్రామంలో నివసించే ప్రజలు మాత్రం మేఘాల నుంచి వర్షం భూమిపై పడటాన్ని ఈ గ్రామం నుంచి చూడవచ్చు.ఈ వింతను చూడటం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున ఈ గ్రామానికి చేరుకోవడం మరొక విశేషం.































