అమరావతి: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల కొనుగోలు చేసిన లగ్జరీ కారు లంబోర్గిని ఉరుస్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ కారు నంబర్ ‘3015’ నెట్టింట వైరల్‌గా మారి, అభిమానుల్లో కుతూహలం రేపింది. ఈ నంబర్ వెనుక ఉన్న స్పెషల్ విషయం ఏమిటని అభిమానులు శోధించగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

కుటుంబానికి సంబంధించిన అంకెలు
రోహిత్ శర్మ తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను కారు నంబర్‌లో పొందుపరిచారని తెలుస్తోంది.
- 3015: ఈ అంకెలను కలిపితే 9 వస్తుంది.
- 30+15: ఈ అంకెలను కలిపితే 45 అవుతుంది, ఇది రోహిత్ శర్మ జెర్సీ నంబర్ కూడా.
- డిసెంబర్ 30: ఈ తేదీ రోహిత్ కుమార్తె సమైరా పుట్టినరోజు.
- నవంబర్ 15: ఈ తేదీ రోహిత్ కుమారుడు అహాన్ పుట్టినరోజు.
ఈ విధంగా తన కుటుంబ సభ్యుల పుట్టినరోజులను, తన జెర్సీ నంబర్‌ను కలిపి రోహిత్ శర్మ ఈ నంబర్‌ను ప్రత్యేకంగా ఎంచుకున్నారని అభిమానులు భావిస్తున్నారు. గతంలో కూడా రోహిత్ పాత కారు నంబర్ 264, వన్డేల్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.
రూ.4.57 కోట్ల విలువైన కారు
రూ. 4.57 కోట్ల విలువైన ఈ లంబోర్గిని ఉరుస్ ప్రస్తుతం రోహిత్ లగ్జరీ కలెక్షన్‌లో కొత్త ఆకర్షణగా నిలిచింది. రోహిత్ చివరిసారిగా భారత్ తరఫున ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. మరో రెండు నెలల తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతూ 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే, మేనేజ్‌మెంట్ దేశవాళీ క్రికెట్‌లో కూడా ఆడాలని సూచించగా, రోహిత్ ఏ నిర్ణయం తీసుకుంటాడన్నది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.































