కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు గత 8 నెలలకు పైగా సినిమాలు తెరకెక్కించడం, అలాగే సినిమాలు విడుదల చేయడం లాంటి ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. దీంతో సినీ ప్రేమికులు సినిమా థియేటర్ వైపు వెళ్లకుండా పూర్తిగా ఓటీటీ ఫ్లాట్ఫామ్ కే అంకితమైపోయారు. దీంతో చిన్న హీరోలు, మరి కొందరు స్టార్ హీరోలు సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో ఓటీటీ ఫ్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ఫామ్ ద్వారా వచ్చిన సినిమాల విజయం శాతం కంటే అపజయాల శాతం ఎక్కువగా ఉంది.

ఇక అసలు విషయంలోకి వెళితే.. చాలా కాలం నుండి హీరో సూర్య సరైన హిట్ దొరకక ఆయన అభిమానుల్ని నిరుత్సాహపరుస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు ప్లాప్ అవుతూ ఉండడంతో ఆయన ప్లాప్ హీరోల లిస్టులో కి చేరుకున్నాడు. అలాగే ఓటీటీ ప్లాట్ ఫాం లో వచ్చే సినిమాలు అన్ని ప్లాప్ అవుతున్నాయి అన్న వాటికి చెక్ పెట్టే విధంగా తాజాగా సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా బ్రేక్ చేసింది. ఈ సినిమాను తమిళ్ లో ‘సూరరై పోట్రు’ అనే పేరుతో విడుదల చేయగా.. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ అనే టైటిల్ తో ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. చాలా రోజుల నుంచి ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న సినీ ప్రేక్షకులకు, అలాగే ముఖ్యంగా సూర్య అభిమానులకు ఈ సినిమా మంచి సినిమా చూసా అన్న ఫీలింగ్ దొరికింది. ఇక ఈ సినిమాలో కథాకథనంతో పాటు నటీనటుల పర్ఫామెన్స్ వీటితోపాటు వివిధ అంశాలపై కలయికతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది.

ఒక రియల్ పర్సన్ లైఫ్ ను దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించడంలో విజయవంతమైంది. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని ఎంచుకుని దాన్ని అద్భుతంగా తెరకెక్కించింది. అయితే ఈ సినిమాలో సూర్య నటించిన క్యారెక్టర్ వెనుక ఉన్న అసలు పర్సన్ ఎవరు అతని కథేంటో ఓసారి తెలుసుకుందామా.. ఆయన పూర్తి పేరు గురు రామస్వామి అయ్యంగర్ గోపీనాథ్. ఈయన పుట్టింది కర్ణాటక రాష్ట్రంలోని మేల్కొటే దగ్గరలో ఉన్న హస్సన్ అనే ఓ మారుమూల గ్రామంలో. ఈయన తండ్రి బడిపంతులు గా పనిచేసేవారు. అంతేకాదు ఆయన నవలలు రాయడంలో కూడా అనుభవం కలవారు.

తర్వాత తండ్రి దగ్గర ఐదో తరగతి వరకు చదువుకున్న గోపీనాథ్ ఆ తర్వాత సైనిక్ స్కూల్ లో చదువులు పూర్తి చేసుకుని పైలెట్ అవ్వాలనే కోరికతో ఎంట్రెన్స్ పరీక్ష ఉత్తీర్ణత అయ్యాడు. ఆ తర్వాత గోపీనాథ్ మూడు సంవత్సరాలపాటు ట్రైనింగ్ పూర్తి చేసుకుని, ఇండియన్ మిలిటరీ అకాడమీ లో పైలెట్ గా సేవలందించాడు. గోపీనాథ్ కేవలం 20 సంవత్సరాలు ఉన్న సమయంలోనే ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సంపాదించి అక్కడ పైలెట్ గా చేస్తూ చివరికి కెప్టెన్ ర్యాంక్ సంపాదించగలడు.

అలా 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ యుద్ధం లో పైలెట్ గా పోరాడిన తర్వాత కేవలం 28 సంవత్సరాల వయసులోనే ఆయన ఆర్మీ నుండి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత గోపీనాథ్.. ‘ గోపీనాథ్ లాజికల్ సస్టైనబుల్ సిరికల్చర్ ఫార్మ్’ మొదలుపెట్టి అత్యాధునిక పద్ధతిలో వ్యవసాయం చేసి ఏకంగా 1996లో రోలెక్స్ లెక్చరర్ అవార్డును ఆయన పొందారు. ఆ తర్వాత హోటల్ కూడా మొదలు పెట్టారు. అలాగే 1997లో తన స్నేహితుడు కెప్టెన్ కె.జె. శ్యాము తో కలిసి బెంగళూరు పట్టణంలో ఓ హెలికాప్టర్ తో లీజ్ కు ఇచ్చే ఆఫీస్ ను మొదలుపెట్టాడు. అలా మొదలు పెట్టిన వ్యాపారం అంచలంచలుగా ఎదిగి మొత్తానికి మూడు చాపర్స్ అలాగే మూడు ఎయిర్ క్రాఫ్ట్ లకు పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యాపారాన్ని ఎయిర్ డెక్కన్ సంస్థగా 2013లో ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రారంభించాడు. అయితే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టే సమయంలో తన ఊరికి ఫ్లైట్ సర్వీస్ ఉండాలని ఆయన కలలుకన్నాడు. అయితే గోపినాథ్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అంత సులువు కాలేదు. 2003 లో మొదలు పెట్టిన ఈ వ్యాపారం 2007 వరకు కేవలం నాలుగు సంవత్సరాల్లో దేశంలో ఉన్న పెద్ద ఎయిర్లైన్స్ కంపెనీలు అయిన జాజ్, కింగ్ ఫిషర్, అలాగే జెట్ ఎయిర్ వేస్ ఇలాంటి కంపెనీస్ ఓనర్ కి నిద్ర పట్టకుండా చేయగలిగాడు.

ఎంతోమంది ప్రజలు కేవలం ఒక్క రూపాయికే ఫ్లైట్ ప్రయాణం అందించే విధంగా గోపీనాథ్ చేసిన ప్రతి మెట్టులో ఆయన ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నాడు. ఒకవైపు ఈయన విమాన రంగానికి సంబంధించి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవితంలో ఎదుగుతున్న సమయంలో ఆయన భార్య భార్గవి ఓ బేకరీ మొదలుపెట్టి బేకింగ్ అండ్ కాంఫిక్షనరీ లో కోర్సు పూర్తిచేసి బన్ వరల్డ్ బేకరీ చైన్ వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా మొదలుపెట్టింది. ఈ బేకరీ బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆవిడ తన భర్త వ్యాపారానికి కావలసిన డబ్బులను సంపాదించి ఇచ్చింది. ఇకపోతే గోపీనాథ్ అంచెలంచెలుగా నిర్మించుకున్న ఎయిర్ డెక్కన్ వ్యాపారాన్ని చూసి ఆ కంపెనీని తనతో కలుపుకోవాలని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విజయమాల్య అప్పట్లో ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఆ సమయంలో లో ఆఫర్ నచ్చి గోపీనాథ్ ఎయిర్ డెక్కన్ కంపెనీ ని హ్యాండ్ ఓవర్ మాత్రమే చేసి అందుకు సంబంధించిన లావాదేవీలను అలాగే మరికొన్ని ఒప్పందాలను దగ్గర ఉండి ఆయన చూస్తున్నారు.

అయితే విజయ్ మాల్యా భారత దేశానికి చేసిన ద్రోహం వల్ల ఆయన దేశం నుండి పారిపోవడంతో గోపినాథ్ తాను చేసుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేశాడు. దీంతో మళ్లీ గోపినాథ్ తన కంపెనీ పేరుని ఎయిర్ డెక్కన్ నుండి సింప్లిఫై డెక్కన్ గా మార్చుకున్నాడు. అంతేకాదు తన కంపెనీ లోగో ను కూడా పూర్తిగా మార్చేశాడు. ఈయన సామాన్య ప్రజలకు కూడా అతి తక్కువ లో గాలిలో ప్రయాణించడానికి ఎంతగానో కృషి చేశారు. గోపీనాథ్ తన నిజ జీవితంలో పల్లెటూరు నుండి ఎయిర్ లైన్స్ ఓనర్ స్థాయికి చేరుకున్న ప్రతి విషయాన్ని ఆకాశమే నీ హద్దురా సినిమా లో సూర్య అచ్చం కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ సినిమాతో హీరో సూర్య కెరియర్ మళ్లీ యూటర్న్ తీసుకుంటుందని సినిమా వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here