సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ రాబడి వచ్చే ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ప్రతి నెలా కొంత మొత్తం పొదుపు చేసి అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. కొన్ని మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. 5 మార్గాల ద్వారా సులభంగా ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందవచ్చు.

స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్లలో కళ్లు చెదిరే లాభాలు ఏ విధంగా ఉంటాయో ఊహించని స్థాయిలో నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి. సరైన అవగాహనతో మంచి షేర్లను ఎంచుకుని తక్కువ మొత్తంలో సంవత్సరాల తరబడి ఇన్వెస్ట్ చేస్తే కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయి.

దీర్ఘకాలంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. నెలకు 500 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ఒక విధంగా రిస్క్ అనే చెప్పాలి. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ లో నగదు డిపాజిట్ చేస్తే మంచి లాభాలు సొంతమవుతాయి.

రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో 10 సంవత్సరాల వరకు డబ్బులు దాచుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో కస్టమర్లకు 3 నుంచి 9 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో కూడా డబ్బులను డిపాజిట్ చేసే అవకాశాలు ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ లో డబ్బులు పెడితే పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 6.8 శాతం వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here