Inzamam Ul Haq: ఇంజమామ్ ఉల్ హక్ ఈ తరం వారికి పరిచయం లేకపోయినప్పటికీ 90ల తరం వారికి ఈయన గురించి సుపరిచితమే ఈయన బ్యాచ్ చేతపట్టారంటే బాల్ బౌండరీ దాటాల్సిందే.ఇంజమామ్ గ్రౌండ్ లోకి దిగారంటే ప్రత్యర్థులు సైతం భయానికి గురవుతారు. ఈయన పరుగులు తీయడానికి ఇష్టపడకపోయినప్పటికీ సిక్స్ లు ఫోర్ లతో బాల్ బౌండరీ దాటిస్తారు.

ఈయన పాకిస్తాన్ జట్టులో ఒకఆటగాడు మాత్రమే కాకుండా కెప్టెన్ గా పాకిస్తాన్ కు ఎన్నో మరుపురాని విషయాలను కూడా అందించారు. ఇలా ఒకప్పుడు సిక్సులు ఫోన్లతో చెలరేగిపోయిన ఇంజమామ్ గత కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్నప్పటికీ తాజాగా అభిమానులు ఈయన బ్యాటింగ్ చూసే అవకాశాన్ని తనకు కల్పించారు.
పాకిస్తాన్‌లో మెగా స్టార్స్ లీగ్ పేరిట టీ10 లీగ్ జరుగుతోంది. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఇంజమామ్ కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.ఈ టోర్నీలో భాగంగా బలోచ్ వారియర్స్ తో జరిగిన మ్యాచులో ఇంజమామ్ చెలరేగిపోయి మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారు.

Inzamam Ul Haq: సిక్స్ లు ఫోర్ లతో చెలరేగిపోయిన ఇంజమామ్…
ఇంజమామ్ బ్యాట్ చేత పట్టి కేవలం 16 బంతుల్లోనే నాలుగు ఫోర్లు ఒక సిక్స్ కొట్టి 29 పరుగులు చేశారు. ఈ క్రమంలో అతడు స్టెపౌట్ అయ్యి కొట్టిన ఓ సిక్సర్ మ్యాచ్ కే హైలైట్‌గా నిలిచింది.ఇలా 52 సంవత్సరాల వయసులో కూడా ఈయన బ్యాటింగ్ తీరు ఏ మాత్రం మారలేదని అభిమానులు మరోసారి గ్రౌండ్లో ఈయన సిక్స్ లు ఫోర్ లని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
































