IPL 2022: ఐపీఎల్ వేలం షురూ అయింది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. పలు ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను దక్కించుకోవడానికి పోటీపడ్డాయి. ఈ వేలంలో ఎక్కువగా అందరి కళ్లు టీమిండియా ఆటగాడు శ్రీయాస్ అయ్యర్ పై పడ్డాయి. అనుకున్నట్లుగానే అతడు భారీ ధరకు అమ్ముడుపోయాడు. కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) అతడిని భారీ ధరకు దక్కించుకుంది.

శ్రీయాస్ కు దాదాపు రూ.12.25 కోట్లను వెచ్చించి కొనుకున్నాడు. అతడితో పాటు సౌతాఫ్రికా స్పీడ్ స్టర్ కగిసో రబాడ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాడు. దాదాపు రూ.9.25 కోట్లను వెచ్చింది. అతడిని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దక్కించుకుంది. ఇక వీరితో పాటుగా.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రూ. 8.52 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ మరో ఆటగాడిని భారీ మొత్తంలో వెచ్చించి కొనుక్కుంది.

అంతే కాకుండా.. కమిన్స్ కు రూ.7.25 కోట్లను ఇచ్చి దక్కించుకుంది. బౌలర్ బౌల్ట్ ను రూ.8 కోట్లు వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకోగా.. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను రూ.5 కోట్లను వెచ్చించి కొనుక్కుంది.
ఇండియన్ పేసర్ మహ్మద్ షమిని రూ.6.25 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో సౌతాఫ్రికా సీనియర్ బ్యాట్స్ మెన్ ఫాఫ్ డెప్లెసిస్ ను రూ.7 కోట్లకు దక్కించుకుంది. మొన్నటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు ఆడిన ఆస్ట్రేలియా డాషింగ్ ఒపెనర్ డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతడికి రూ.6.25 కోట్లను వెచ్చించారు. ఇక లక్నో టీమ్ విషయానికి వస్తే.. అందులో ప్రొటీస్ ఒపెనర్ గా ఉన్న డికాక్ రూ.6.75 కోట్లకు అమ్ముడుపోయాడు. ఇక ఇప్పటి వరకు జరిగిన ఈ ఐపీఎల్ 2022 వేలంలో ఇవే అత్యధికంగా అమ్ముడుపోయిన ఆటగాళ్లు.
వేలంలో అపశ్రుతి..
ఇదంతా ఇలా ఉండగా.. ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో ఆక్షనీర్ హ్యూ ఎడ్మెడ్స్ వేలం మధ్యలో కుప్పకూలాడు. దాంతో వేలం నిలిచిపోయింది. శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగను వేలం పాడుతుండగా… ఉన్నట్లుండి హ్యూ ఎడ్మెడ్ కింద పడిపోయారు. అతడికి వెంటనే ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతవ వేలం వాయిదా పడగా.. మళ్లీ సాయంత్రం మొదలు కానుంది.
IPL Auction comes to shocking halt as auctioneer Hugh Edmeades collapses #IPLAuction2022 #IPLMegaAuction2022 @IPL pic.twitter.com/F4SQ4UQXdF
— Lakshya Arora (@lakshya_varora) February 12, 2022































