“నీలా డబ్బు కోసం తలపాగా వేసుకోను”..అక్షయ్ కుమార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్..!!

0
229

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై ఓ క్రికెటర్ ఘాటు విమర్శలు చేసాడు.. ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్‌కు చెందిన ఆల్ రౌండర్ హర్‌ప్రీత్ బ్రార్ నటుడు అక్షయ్ కుమార్‌పై హాట్ కామెంట్స్ చేశాడు. తాను డబ్బుకోసం తలపాగా ధరించనని, ఐ సపోర్ట్ ఫార్మర్స్ అనే హ్యాష్‌ట్యాగ్ చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హర్‌ప్రీత్ బ్యాటింగ్ చేసి బౌలింగ్ కూడా చేశాడు. అప్పటి నుంచి అతను ఐపీఎల్‌లోస్టార్ ప్లేయర్ అయ్యాడు.

సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రం నుంచి అక్షయ్ కుమార్ లాగా కనిపిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ పొగిడాడు. హర్ప్రీత్ ఆ మెస్సేజ్ స్క్రీన్ షాట్‌ను ట్వీట్ చేస్తూ అక్షయ్ కుమార్‌లా తాను డబ్బు కోసం తలపాగా ధరించను అంటూ హేళన చేశాడు.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. అప్పటి నుంచి అతను ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.

వెంటనే ఏప్రిల్ 25 న ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయింది. అందులో ఓ అభిమాని అతన్ని అక్షయ్ కుమార్ తో పోల్చిన తరువాత అతడు స్పందించాడు. ఈ ట్వీట్‌లో రైతుల ఉద్యమంలో అక్షయ్ కుమార్ పాత్రను హర్‌ప్రీత్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. తాను డబ్బు కోసం తలపాగా ధరించడం లేదని అక్షయ్ కుమార్ ను ఉద్ధేశించి అన్నాడు.శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ 17 బంతుల్లో అజేయంగా 25 పరుగులు చేశాడు. అంతేకాకుండా పంజాబ్ సహాయానికి సమర్థవంతంగా బౌలింగ్ చేశాడు.

విరాట్, మాక్స్వెల్లను వరుసగా రెండు బంతులతో ఔట్ చేశాడు. ఆ తర్వాత అతను ఏబీ డివిలియర్స్ ను కూడా అవుట్ చేశాడు. ఆ విధంగా హర్‌ప్రీత్ 4 ఓవర్లలో 25 పరుగులు 19 పరుగులకు 3 ముఖ్యమైన వికెట్లు తీశాడు..ఇక అక్షయ్ కుమార్ ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. తాజాగా సూర్యవంశీ అనే సినిమాలో నటిస్తున్నాడు అక్షయ్..ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here