ప్రస్తుతం వాతావరణంలో మార్పులకు అనుగుణంగా, కాలుష్య కారణంగా చాలామందికి జుట్టు సమస్యలు అధికమవుతున్నాయి. అందులో ముఖ్యంగా చుండ్రు సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. తలలో చుండ్రు ఏర్పడటం వల్ల జుట్టు సమస్యలు అధికమవుతున్నాయి. అంతేకాకుండా ఈ చుండ్రు వల్ల జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువగా తలెత్తుతుంది. అయితే ఈ చుండ్రును పోగొట్టుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి.ఈ షాంపూ కన్నా సులభమైన మార్గాల ద్వారా తలలో చుండ్రును పోగొట్టుకునే అద్భుతమైన చిట్కాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.

తలలో చుండ్రు సమస్య అధికంగా ఉన్నవారు ముందు రోజు రాత్రి వేపాకు రెబ్బలను నీటిలో నానబెట్టాలి. ఆ వేపాకు నీళ్లతో మరుసటి రోజు ఉదయం తల స్నానం చేయడం ద్వారా చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా మార్కెట్లో లభించే ఎక్కువ గాఢత గల షాపులకు బదులు తక్కువ గాఢత గల షాంపూలను ఉపయోగించడం ఉత్తమం. ఆపిల్ వెనిగర్ చుండ్రును తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. వెనిగర్ ను నీళ్లలో షాంపూలాగ సమపాళ్ళలో కలిపి వాటితో స్నానం చేయడం ద్వారా చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

చుండ్రు సమస్యను తగ్గించడం లో నిమ్మకాయ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి వాటితో మన తల భాగానికి బాగా అంటుకునే విధంగా అంటించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా బాగా పులిసిన మజ్జిగను మన తల భాగానికి, కుదుళ్లకు అంటించడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. ఈ విధంగా సులువైన చిట్కాలను పాటించడం ద్వారా చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా, జుట్టు రాలకుండా, ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here