సాధారణంగా చాలా లావుగా ఉన్నవారు మాత్రమే వ్యాయామం చేస్తే సరిపోతుంది.సన్నగా, పీలగా ఉన్న వారు వ్యాయామం చేయవలసిన అవసరం లేదని చాలా మంది భావిస్తుంటారు.వ్యాయామం అనేది కేవలం శరీరం సన్నబడటం కోసం చేస్తున్నారు అనుకుంటే పొరపాటు పడినట్లే. వ్యాయామం కేవలం మన శరీరబరువు తగ్గించుకోవడం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం ఎంతగానో దోహదపడుతుంది.

సాధారణంగా అధిక శరీర బరువు ఉన్నవారు వ్యాయామం చేస్తూ శరీర బరువును తగ్గించుకుంటారు. అదేవిధంగా సన్నగా ఉన్న వారు కాస్త ఒళ్ళు చేయాలంటే తప్పనిసరిగా డైట్‌తో పాటు వ్యాయామం తప్పదు. సన్నగా ఉన్నవాళ్లు కోచ్ ఆధ్వర్యంలో ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. సన్నగా ఉన్న వారైనా, అధిక శరీర బరువు ఉన్న వారైనా తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం.
పది నిమిషాలు స్కిప్పింగ్ చేయడం, ఎనిమిది నిమిషాల పాటు వాకింగ్ చేయడంతో సమానంగా ఉంటుంది. ఈ విధంగా స్కిప్పింగ్ చేసేటప్పుడు మీరు ఎంపిక చేసుకొనే తాడు మీ ఎత్తుకు రెండింతలు ఉండాలి. అలాగే ఎప్పుడూ ఒకే విధమైన ఎక్సర్సైజులు మాత్రమే కాకుండా క్వాట్స్,మిలటరీ ప్రెస్,డెడ్ లిప్ట్, డంబెల్ రో,బెచ్ ప్రెస్, ప్రయత్నించడం వల్ల కండరాలు ఎంతో బలంగా తయారవుతాయి.
అదేవిధంగా ప్రతిరోజు ఓ అరగంట పాటు నడక తప్పనిసరి. ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి ఇవి తరచూ మనలో కలిగే ఒత్తిడి ఆందోళన నుంచి విముక్తి కలిగించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింప చేస్తాయి.రోజుకు అరగంట పాటు వాకింగ్ చేయడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక వ్యాయామం అనేది కేవలం లావుగా ఉన్నవారు మాత్రమే కాకుండా సన్నగా ఉన్న వారు కూడా చేయడం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు.

































