Hemachandra -Sravana Bhargavi: ఈ మధ్యకాలంలో పెళ్లి బంధాలు ఎక్కువకాలం నిలువ లేక పోతున్నాయి.ప్రేమించుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకున్న వారు సైతం ఇలా విడాకులు తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకుల విషయం సంచలనంగా మారింది. అలాగే కోలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య ధనుష్ సైతం విడాకులు తీసుకోవడం అందరిని కలిసి వేసింది.ఇకపోతే హేమచంద్ర శ్రావణ భార్గవి సైతం విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలపై ఈ జంట ఏమాత్రం స్పందించలేదు.వీరు కూడా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా గడిపిన ఈ జంటకు ఒక కూతురు కూడా ఉంది. ఇలా ఇన్ని సంవత్సరాలు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట చివరికి విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.అయితే వీరు విడాకులకు కారణం ఏమిటి అనే విషయానికి వస్తే సింగర్ హేమచంద్ర మరొక స్టార్ సింగర్ తో చనువుగా ఉండటమే విడాకులకు దారితీసిందని వార్తలు వినబడుతున్నాయి.
విడాకులు రాకుండానే దూరంగా ఉన్న జంట…
హేమచంద్ర మరొక సింగర్ తో మాట్లాడిన ఆడియో క్లిప్ విన్న శ్రావణ భార్గవి హేమచంద్ర నుంచి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే అధికారకంగా వీరికి విడాకులు రాకపోయినా ఇప్పటికే ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించకుండా ఉండడంతో ఈ వార్తలు నిజమేనని తెలుస్తోంది.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది.































