లోన్ మారటోరియం డబ్బులు ఖాతాలో పడలేదా.. అసలు కారణమిదే..?

0
175

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొన్ని రోజుల క్రితం రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. మార్చి నెల నుంచి ఆగస్టు నెల వరకు రుణాలకు వడ్డీ మీద వడ్డీని వసూలు చేయడం లేదని.. వడ్డీ మాఫీ డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్రం వారం రోజుల క్రితమే వడ్డీ మాఫీ డబ్బులను బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. అయితే కొందరు మాత్రం ఆ డబ్బులు ఇంకా ఖాతాలలో జమ కాలేదని చెబుతున్నారు.

కేంద్రం 2 కోట్ల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వాళ్లందరికీ ప్రయోజనం కలిగే విధంగా వడ్డీ మీద వడ్డీ మాఫీ నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ లతో పాటు మరికొన్ని లోన్లు తీసుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే కొందరు మాత్రం తమ ఖాతాలలో లోన్ మారటోరియం డబ్బులు ఇప్పటికీ జమ కాలేదని చెబుతున్నారు. ఇలా డబ్బులు జమ కాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

కేంద్రం కొన్ని నిబంధనల ప్రకారం లోన్ మారటోయానికి అర్హులను ఎంపిక చేస్తోంది. 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల 29 నాటికి లోన్ అకౌంట్ మొండి బకాయిగా మారకపోతే మాత్రమే కేంద్రం ఈ ప్రయోజనాన్ని అందిస్తోంది. వీళ్లు మాత్రమే లోన్ మారటోరియం వడ్డీ మాఫీని పొందడానికి అర్హులవుతారు. లేకపోతే వీళ్లు కేంద్రం అందిస్తున్న వడ్డీ మీద వడ్డీ మాఫీ ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉండవు.

వడ్డీ మాఫీ స్కీమ్ ప్రకారం ఎవరైతే లోన్ మారటోరియం ఎంచుకుంటారో వాళ్లు సాధారణ వడ్డీనే చెల్లించాల్సి ఉంటుంది. లోన్ మారటోరియం ఆప్షన్ ను ఎంచుకున్న వాళ్లకు కేంద్రం వడ్డీ మీద వడ్డీ వేయదు. ఆ ఆప్షన్ ఎంచుకోని పక్షంలో మాత్రమే క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here