రోజులు గడిచే కొద్దీ మనిషి వయస్సు పెరుగుతూ పోతుంది. 50 సంవత్సరాలు దాటితే రకరకాల ఆరోగ్య సమస్యలు వేధించడంతో పాటు సొంతంగా పనులు చేసుకోవడంకూడా కష్టమవుతోంది. అయితే జీవితంలో చాలామంది యవ్వనాన్ని తిరిగి పొందే ఛాన్స్ దొరికితే ఎంతో బాగుంటుందని అభిప్రాయపడుతుంటారు. అయితే యవ్వనాన్ని తిరిగి పొందడం సాధ్యమేనా అనే ప్రశ్నకు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సాధ్యమే అని ప్రూవ్ చేస్తున్నారు.

ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల అద్భుత పరిశోధన ద్వారా 60 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు 25 సంవత్సరాల యవ్వనాన్ని పొందడం సాధ్యమేనని తెలుస్తోంది. ప్రెషరైజ్డ్‌ ఆక్సిజన్‌ చాంబర్‌ ప్రయోగాలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను ప్రూవ్ చేశారు. 64 సంవత్సరాల వయస్సు పైబడిన 35 మంది వృద్ధులపై 90 రోజుల పాటు శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. ప్రతిరోజూ వృద్ధులకు 90 నిమిషాల పాటు ఆక్సిజన్ ఛాంబర్లలో ఉంచి వాళ్లకు స్వచ్చమైన ఆక్సిజన్ అందేలా చేశారు.

90 రోజుల ప్రయోగాల అనంతరం శాస్త్రవేత్తలు వృద్ధుల జీవకణాల్లో ఊహించని మార్పులను గుర్తించారు. క్రోమోజోమ్‌ల లో ఉండే టెలోమర్ తొడుగులు సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ కుంచించుకు పోతాయని.. అయితే ప్రయోగాల్లో పాల్గొన్న వృద్ధుల్లో మాత్రం టెలోమర్ తొడుగులు పెరిగాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగాలతో వయస్సు మీద పడటాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

శరీరంలో సెనెసెంట్‌ కణాల శాతం కూడా తగ్గిందని.. జాంబీ కణాల పేరుతో పిలవబడే ఈ కణాలు శరీరానికి హాని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలో జాంబీ కణాలు పేరుకుపోతే అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. జాంబీ కణాల మోతాదును తగ్గించడం వృద్ధ్యాప్య ఛాయలు త్వరగా రావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here