న్యూ ఢిల్లీ: బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లోకి వచ్చారు. చాలా కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక ఎమోషనల్ వీడియో ద్వారా అభిమానులను కలిచివేశారు. ఆ వీడియోలో ఆమె కన్నీళ్లతో మాట్లాడుతూ “నాకు సహాయం చేయండి, నేను నా ఇంట్లోనే హరాస్మెంట్‌కి గురవుతున్నాను” అని వాపోయారు.

వేధింపులు, #MeToo ఉద్యమం, పోలీసుల స్పందన
ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ఈ హింస 2018లో ఆమె #MeToo ఉద్యమంలో పాల్గొన్న తర్వాతే ప్రారంభమైందట. “I’m sick and tired of this harassment!! It’s been going on since 2018. Aaj fed up hokar maine police ko call kiya. Please someone help me! Do something before it’s too late,” అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.
తన ఇంట్లోనే ఈ వేధింపులు జరుగుతున్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. “నాకు అంతగా మానసికంగా క్షీణత వచ్చిందని, ఆరోగ్యం పాడైపోయిందని, ఇంటి పరిస్థితి పూర్తిగా మానసిక అశాంతిని ప్రతిబింబిస్తోందని” ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పని మనుషులపై అనుమానాలు, దొంగతనాలు
“నాకు సరైన మైద్స్‌ను కూడా పెట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే గతంలో నా ఇంట్లో పనివారిగా వచ్చిన వారే వస్తువులు దొంగిలించారు. వారు ముందుగానే ప్లాన్ చేసి పంపిన వారేమోననే అనుమానాలు ఉన్నాయి,” అని తనుశ్రీ అన్నారు.
అభిమానుల మద్దతు, సినీ పరిశ్రమకు విజ్ఞప్తి
ఆమె చేసిన ఈ పోస్టుకు ప్రేక్షకుల నుండి పెద్ద సంఖ్యలో స్పందన వస్తోంది. అభిమానులు, నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతూ, వెంటనే సాయం అందించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం ఉంది అనే వాదనలు వినిపిస్తున్నాయి.
తనుశ్రీ గతంలోనూ నానా పాటేకర్‌పై #MeToo ఆరోపణలు చేయడంతో సంచలనానికి కేంద్రబిందువయ్యారు. ఇప్పుడు ఆమె చేస్తున్న ఈ అభ్యర్థన ఆమె వ్యక్తిగత జీవితం ఎంత గాయపడిందో స్పష్టంగా చెబుతోంది. ఆమెకు సహాయం చేసేందుకు సంఘటితంగా ప్రభుత్వ యంత్రాంగం, సినీ పరిశ్రమ ముందుకు రావాలన్నది నెటిజన్ల డిమాండ్.



























