వామ్మో.. అందరు చూస్తుండగానే ఆ బ్యూటీకి ముద్దులు పెట్టిన రాకింగ్ రాకేష్..?

0
112

బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఈ కార్యక్రమంలో పురుషులు స్త్రీ వేషధారణలో ఉండి కామెడీలను పండించేవారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమంలో కూడా కేవలం జెంట్స్ కమెడియన్స్ మాత్రమే కాకుండా, లేడీ కమెడియన్స్ కూడా ఎంటర్ అయ్యారు.ఈ క్రమంలోనే వీరందరూ కలిసి స్టేజ్ పై చేసే హంగామా కొన్నిసార్లు విమర్శలకు తావిస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో లో భాగంగా రాకింగ్ రాకేష్ స్కిట్ లో భాగంగా కొంచెం హద్దులు మీరి లేడీ కమెడియన్ తో ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ స్కిట్ లో భాగంగా రాకింగ్ రాకేష్ మరొక కమెడియన్ రోహిణితో కలిసి ఒక ఉద్యోగం కోసం వెళ్తారు.అయితే అక్కడ కేవలం భార్యాభర్తలకు మాత్రమే అవకాశం అని రాసి ఉండటంతో వీరిద్దరూ భార్యాభర్తల అన్నట్టుగా నటిస్తారు.

ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్ చూడండి మేము నిజంగానే భార్య భర్తల మంటూ దగ్గర నుంచి రోహిణికి ముద్దు పెడతాడు.రాకేష్ ఉన్నఫలంగా ఇలా చేయడంతో రోహిణి ఎంతో ఆశ్చర్యానికి గురి అవుతుంది. ఈ సీన్ చూసిన జడ్జెస్ కూడ షాక్ అవుతూ నవ్వుకుంటారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ప్రోమో చూసిన నెటిజన్లు కేవలం రేటింగ్స్ కోసమే కమెడియన్స్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని…ఒక స్కిట్ లో లేడీ కమెడియన్స్ ఉంటే వారికి ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉండాలి కానీ ఈ విధంగా ముద్దులు పెట్టుకోవడం ఏంటి అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here