నియామకానికి సంబందించిన రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది జగన్ సర్కార్. దీనికి గవర్నర్ కు పంపడం.. వెంటనే అయన ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం వేయడం అన్ని చక చకా జరిగిపోయాయి. ఈ క్రమంలో వెంటనే ఆ ఆర్డినెన్స్ పై జీవో జారీ చేసి ఎన్నికల కమిషనర్ విధులనుంచి నిమ్మగడ్ద రమేష్ ను తప్పించింది.

ఇందుకు సంబంధిచిన మూడు జీవోలను ప్రభుత్వం గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే ఎలక్షన్ కమిషనర్ ను ఆర్డినెన్స్ ద్వారా తప్పించడంపై కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మార్చి నెలలో లోకల్ బాడి ఎలెక్షన్స్ ను వాయిదావేస్తూ ఈసీ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనివెనుక మాజీ సీఎం చంద్రబాబు ఉన్నాడంటూ సీఎం జగన్ సహా మరికొందరు వైసీపీ నేతలు మండిపడ్డ విషయం తెలిసిందే…































