Y.S Vivekananda Reddy Murder Case: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి 2019 లో దారుణంగా హత్యకు గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ హత్య గురించి అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఎన్నో వార్తలు తెరపైకి వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని తనకు మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సహకరిస్తున్నారంటూ వీరి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి తనపై వస్తున్న వార్తల గురించి తాజాగా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది కనుక తాను ఈ విషయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. అవినాష్ రెడ్డి, సురేంద్రనాధ్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి తనను ఎప్పుడు కలవలేదని మాజీ డీజీపీ సవాంగ్ స్పష్టంచేశారు.

వైయస్ వివేకానంద రెడ్డి,అవినాష్ రెడ్డి కుటుంబాలు వైయస్ జగన్ కు రెండు కళ్ళు లాంటివని ఈ విషయం గురించి జగన్ నాతో ఎప్పుడు చెప్పేవారని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఇక వివేకా హత్య కేసు చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఈ కేసు విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని సీఎం జగన్ తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
దోషులకు తప్పకుండా శిక్ష పడాలి….
కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణకు కావాల్సిన అన్ని వివరాలు ఇవ్వాలని సీఎం జగన్ తనని కోరినట్లు తెలియజేశారు ఈ కేసు విషయంలో దోషులకు తప్పకుండా శిక్ష పడాలని శిక్షపడేలా చూడమని జగన్ ఎల్లప్పుడు ఈ కేసు గురించి తనతో చర్చించే వారని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు ఇక ఈ కేసుపై వివేకా కూతురు సునీత తన భర్త రాజశేఖర్ రెడ్డి తనను కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి చెప్పిన విషయాలను వారికి తెలియ చేశానని వెల్లడించారు.































