Jaya Bachchan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఏ విషయం గురించి మాట్లాడిన క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు వారికి కోపం తెప్పించే విషయాలు ప్రస్తావనకి వచ్చిన వారు నవ్వుతూ సమాధానం చెబుతూ ఉంటారు. అయితే బాలీవుడ్ నటుడు అమితాబ్ భార్య జయా బచ్చన్ మాత్రం పెద్ద ఎత్తున మీడియాపై నోరు పారేసుకుంటూ ఉంటారు.

ఈమె తరచూ ఫోటోగ్రాఫర్లపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉండడం వల్ల నేటిజన్ లు ఈమె పట్ల ఎంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈమె తన మనవరాలు నవ్య నవేలి గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ప్రస్తుత జనరేషన్ లో ఉన్నటువంటి పిల్లలు వారి రిలేషన్ ఎక్కువ కాలం పాటు కొనసాగాలంటే శారీరక ఆకర్షణ ఎంతో ముఖ్యమని ఇలా శారీరకంగా కలిసినప్పుడే వారి బంధం మరికొన్ని రోజులు పాటు కొనసాగుతుందని ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏ రిలేషన్ షిప్ లో అయినా శారీరక ఆకర్షణ తప్పనిసరి అంటూ ఈమె తెలిపారు. ఇకపోతే తన కుమార్తె శ్వేతా బచ్చన్ కూతురు నవ్య నవేలి పెళ్లి కాకుండానే పిల్లల్ని కన్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈమె వెల్లడించారు.మా కాలంలో మేము ఇలాంటి ప్రయోగాలు చేయలేదు కానీ నేటితరం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అంటూ జయ బచ్చన్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jaya Bachchan: జయా బచ్చన్ వ్యాఖ్యలపై మండిపడుతున్న నేటిజన్స్…
ఈ విధంగా పెళ్లి కాకుండానే పిల్లల్ని కనొచ్చు అంటూ ఈమె కామెంట్ చేయడమే కాకుండా నేను చేసిన ఈ వ్యాఖ్యల పై తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలుసు అంటూ ఈమె పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఈమె చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలతో పాటు నేటిజన్ లు ఒకింత ఆశ్చర్యానికి గురవడమే కాకుండా ఈమె పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో యువతకు ఇలాంటి సందేహాలను ఇవ్వడం అవసరమా అంటూ మండిపడుతున్నారు.



























