Jordar Sujatha: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ ఒకరు. బిగ్ బాస్ తర్వాత సుజాత జబర్దస్త్ కార్యక్రమంలో రాకేష్ టీంలో సందడి చేస్తూ ఉండేవారు. ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నటువంటి సుజాత ఏకంగా రాకేష్ ప్రేమలో పడిపోయారు..

వీరి ప్రేమ విషయాన్ని జబర్దస్త్ కార్యక్రమంలో వేదికపై అందరికీ తెలియజేశారు. ఇలా ప్రేమలో ఉన్నాము పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు అంటూ వీర ప్రేమ విషయాన్ని బయట పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇలా ప్రేమలో ఉన్నటువంటి సుజాత రాకేష్ ఇద్దరు ప్రేమలో విహరిస్తూ ఎట్టకేలకు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.
ఇలా పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. అదేవిధంగా సుజాత పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేస్తుంది. అయితే పెళ్లి తర్వాత మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన ప్రేమ,పెళ్లి గురించి పలు విషయాలను తెలియచేశారు.యాంకర్ సుజాతను ప్రశ్నిస్తూ అసలు రాకేష్ ప్రేమలో ఎలా పడ్డారు అందరిలాగే మీకు గుండెల్లో గంటలు మోగడం, మెరుపులు రావడం వంటివి జరిగాయా అంటూ ప్రశ్నించారు.

Jordar Sujatha: తన పట్ల చాలా శ్రద్ధ తీసుకునేవారు…
ఈ ప్రశ్నకు సుజాత సమాధానం చెబుతూ నాకు రాకేష్ ప్రేమలో పడినప్పుడు గుండెల్లో గంటలు మోగలేదని మెరుపులు కూడా రాలేదని నవ్వుతూ సమాధానం చెప్పారు. ఇక్కడ నేను ఒంటరిగా ఉండేదాన్ని అయితే తనకు బాగ లేనప్పుడు కూడా పెద్దగా పట్టించుకోకుండా షూటింగ్కు వెళ్లేదని కానీ రాకేష్ మాత్రం తన పట్ల చాలా కేర్ తీసుకున్నారు.సరైన సమయానికి తినకపోతే తినమని చెబుతూ టాబ్లెట్స్ వేసుకోమంటూ తన పట్ల చూపించిన ఆ కేరింగ్ కే తాను పడిపోయానని అలా తనతో ప్రేమలో పడ్డాను అంటూ ఈ సందర్భంగా సుజాత రాకేష్ తో ప్రేమలో పడిన విషయాన్ని చెబుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.