Journalist Jaffar: ప్రముఖ జర్నలిస్టుగా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జాఫర్ ఇట్లు మీ జాఫర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈయన ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన బండ్ల గణేష్ ను ఇంటర్వ్యూ చేశారు.

ఇలా బండ్ల గణేష్ తో నిర్వహించిన ఇంటర్వ్యూలో భాగంగా జాఫర్ మాట్లాడుతూ మీ మాటలు పొగడ్తలు.. భట్రాజు పొగడ్తలుగా ఉన్నాయి అంటూ మాట్లాడారు ఇలా భట్రాజుల కమ్యూనిటీ గురించి ఈయన మాట్లాడటంతో ఈ విషయం కాస్త వివాదంగా మారింది దీంతో భట్రాజుల కమ్యునిటీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళ జర్నలిస్ట్ జాఫర్ కి ఫోన్ చేసి నిలదీశారని ఆయన ఒక వీడియో ద్వారా తెలియజేశారు.
ఈ వీడియోలో భాగంగా జాఫర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నిజంగా చెబుతున్నా నేను ఆ పదం వాడినందుకు చాలా బాధపడ్డాను.ఇలా ఒక కమ్యూనిటీకి సంబంధించిన పదాన్ని నేనెందుకు వాడాను అని బాధతో పశ్చాతాపడ్డానని ఈయన తెలియజేశారు. నేను ఎవరిని కించపరచాలన్న ఉద్దేశంతో ఆ పదం వాడలేదని జాఫర్ తెలిపారు.

Journalist Jaffar: ఈ కమ్యూనిటీ పై ఎంతో గౌరవం ఉంది..
తనకు తెలియకుండా ఫ్లోలో ఆ పదం వాడానని ఇలా తాను మాట్లాడిన మాట వల్ల బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు చెబుతున్నానని… తనకు ఈ కమ్యూనిటీ పై ఎంతో గౌరవం ఉందని తనని అందరూ క్షమించాలంటూ ఈయన క్షమాపణలు కోరుతూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.