Journalist Prabhu : ఆస్కార్ కోసం 80 కోట్ల ఖర్చు… అవార్డు కన్నా ఆ డబ్బు ఎంత… క్లారిటీ ఇచ్చిన కార్తికేయ…: జర్నలిస్ట్ ప్రభు

0
112

Journalist Prabhu : ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ అవార్డు వచ్చిందనే చర్చ కంటే అవార్డును రాజమౌళి కొన్నాడనే విషయం మీద ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఇలాంటి చర్చ పొరుగు రాష్ట్రం వాళ్ళు ఈర్ష్యతో చేసి ఉన్నా ఏమీ అనిపించదు కానీ మన తెలుగు వాళ్ళే ఇలాంటి చర్చను జరపడం విడ్డూరంగానూ ఒకింత బాధగానూ అనిపిస్తుంది. ఆస్కార్ అందుకోవడం ఒక గర్వకారణం అయితే అందుకు ప్రశంశించకపోయినా పర్వాలేదు కానీ అవార్డు ఎలా వచ్చింది, ఎంత డబ్బు పెట్టి అవార్డు కొన్నాడు వంటి చర్చలు ఎబ్బెట్టుగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల వాళ్ళు వారిలో ఎవరికైనా అవార్డు వస్తే ఇలానే కించపరుస్తారా అన్నది ప్రశ్న. ఇక ఈ ఇష్యూలో రాజమౌళి కొడుకు కార్తికేయ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ ఇష్యూ విశ్లేషణ అందించారు జర్నలిస్ట్ ప్రభు.

అన్ని కోట్ల ఖర్చు నిజమేనా…

ఆస్కార్ వేదిక మీద తెలుగు సినిమాకు తెలుగు పాటకు అవార్డు రావడం నిజానికి మనకు గర్వకారణం కానీ అది వదిలేసి అవార్డు కోసం రాజమౌళి 80 కోట్లు ఖర్చు చేశాడంటూ మాట్లాడటం బాగోలేదని ప్రభు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు జరిగిన ఇలాంటి చర్చలకు చెక్ పెడుతూ రాజమౌళి కొడుకు కార్తికేయ క్లారిటీ ఇచ్చారు. ఆస్కార్ వరకు మన పాట వెళ్ళడానికే ఖర్చు కచ్చితంగా అయింది అయితే అది 80 కోట్లు మాత్రమే కాదు ఒక అయిదారు కోట్లయితే ఖర్చు అయింది. అది కూడా ఆస్కార్ కి పంపినప్పుడు ఓటింగ్ కోసం ప్రపంచంలోని నలుమూలల ఉన్న కొంతమంది వ్యక్తులకు మన సినిమా చేరువ అవ్వాలి. అందుకోసం షోస్ వేయడం అలానే ఈవెంట్స్ చేయడం లాంటివి చేయాల్సి ఉంటుంది అందుకు ఖర్చు పెట్టాం.

కానీ ఆస్కార్ ను కొనలేశు దు అంటూ చెప్పారు. ఇక ప్రభు కార్తికేయ కామెంట్స్ మీద మాట్లాడుతూ కార్తికేయ క్లారిటీ ఇచ్చి మంచి పని చేసారు. లేకపోతే మనవాళ్లలో కొంతమంది అవగాహన రాహిత్యంతో ఆస్కార్ ను కొనుక్కోవచ్చు రాజమౌళి కొన్నాడు అనే భ్రమలో ఉండిపోతారు. కార్తికేయ ఇచ్చిన క్లారిటీ వల్ల కనీసం అర్థం అవుతుంది ఆస్కార్ కొంటే రాదు అని అంటూ చెప్పారు.