K K : ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే మరణం యావత్ భారత దేశాన్ని దిగ్బ్రాంతికి లోను చేసింది. మంగళవారం కలకత్తాలోని నజ్రుల్ మంచాలోని గురుదాస్ కాలేజ్ వద్ద జరిగిన కాన్సర్ట్ లో పాల్గొన్న కేకే ఆ తరువాత హోటల్ ఓబేరాయ్ వెళ్ళాక అక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లినా అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు.

అసహజ మరణంగా కేసు నమోదు….
ఇక పోలీసులు మాత్రం కేకే మృతిని అసహజ మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఆయన దేహంపైనా తలపైనా రంధ్రాలవంటి గాయాలను పోలీసులు గుర్తించటంతో ఆయనది సహజ మరణం కాదని కేసు ఫైల్ చేసారు. అయితే ఆయన గుండెపోటుతో మరణించి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాన్సర్ట్ లో సదుపాయాలు సరిగా లేకపోవడంతో అస్వస్థతకు లోనైనట్లు కాన్సర్ట్ కు సంబంధించిన వీడియోల్లో తెలుస్తోంది. కేకే మృతి పై క్లారిటీ బుధవారం పోస్టుమార్టం తరువాత వస్తుంది.

పోలీసులు కాన్సర్ట్ యాజమాన్యంను, హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. హోటల్లో ని సీసీ టీవీ లను కూడా పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా మూడు దశబ్దాలుగా తన గాత్రంతో అలరిస్తున్న గొంతు మూగబోయింది. దాదాపు 800 కి పైగా పాటలు తెలుగు తమిళం, హిందీ, మలయాళం, గుజరాతి, బెంగాలీ, కన్నడ, అస్సామి భాషలో పాడారు. హిందీ పాటలు పాడక ముందే 3000 కి పైగా గజల్స్ పాడారు.


































