ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చాలా మంది సెలబ్రెటీలు ఇళ్లకే పరిమితమయ్యారు.ఇలాంటి సమయంలోనే ఇంట్లో ఉంటూ మన పై కలిగే అధిక ఒత్తిడి మానసిక ఆందోళనలను ఏ విధంగా తగ్గించుకోవాలో తెలియజేస్తూ నటి కాజల్ అగర్వాల్ ఓ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటూ,సృజనాత్మకంగా అనుభూతి చెందడం ఈ సమయంలో ఎంతో అవసరమని కాజల్ అగర్వాల్ ఈ పోస్టు ద్వారా తెలియజేశారు. కరోనా సమయంలోనే గత ఏడాది వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే తను కమిట్ అయిన సినిమాల షూటింగ్లో పాల్గొంటూ ఎంతో బిజీగా గడుపుతున్న తరుణంలోనే కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది.

కరోనా వ్యాప్తి అధికమవడంతో చాలా మంది సెలబ్రిటీల షూటింగ్ లు వాయిదా పడి ఇంటికి పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉంటూ తను ఏవిధంగా కాలక్షేపం చేస్తుందనే విషయం పై కాజల్ అగర్వాల్ తెలియజేశారు.ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇంట్లో ఉంటూ ఏదో ఒక పని చేయడం ద్వారా మన పై కలిగే ఒత్తిడి ఆందోళనలు దూరమవుతాయని ఆమె తెలిపారు.

“నేను ఇటీవల అల్లికలు చేస్తున్నా. ఇది నాకు విశ్రాంతిని కలిగించడంతో పాటు మానసిక క్షేమాన్ని అందిస్తోంది. ఇతరుల కోసం ఏదైనా సృష్టించడం గొప్ప అనుభూతి”. మరి ఈ విరామ సమయంలో మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు? అంటూ కాజల్ అగర్వాల్ తన అల్లికలకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here