ముంబై బ్యూటీ కామ్నా జెఠ్మలానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో గోపీచంద్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ” రణం” సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుసగా సామాన్యుడు, బెండు అప్పారావు ఆర్. ఏం. పి,కత్తి కంతారావు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీకి “ప్రేమికులు” సినిమా ద్వారా పరిచయం అయినప్పటికీ ఈ సినిమా ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేదనే చెప్పాలి .

తర్వాత కామ్నా జెఠ్మలానీ తెలుగు,తమిళ, కన్నడ ఇండస్ట్రీలో పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ సరైన అవకాశాలు రాకపోవడంతో సినీఇండస్ట్రీకి దూరమైన కొంతకాలానికి బెంగళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకొని తన వైవాహిక జీవితాన్ని గడుపుతోంది. తాజాగా ప్రముఖ టెలివిజన్లో ప్రసారమయ్యే పాపులర్ షో అలీతో సరదాగా షోలో గెస్ట్‌గా విచ్చేసి కామ్నా జెఠ్మలానీ తన కెరీర్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
తాను సాంప్రదాయాలకు విలువ ఇచ్చే సింధీ కుటుంబం నుంచి వచ్చానని, మా కుటుంబంలో 21 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేస్తారు కానీ మాఅమ్మ నాకు సపోర్ట్ చేయడం వల్లే ఈ స్థాయికి రాగలిగానని చెప్పుకొచ్చింది. అలాగే తాను మొదట మోడలింగ్, డ్యాన్సర్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసానని నామొదటి జీతం 300 అని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఇప్పటికీ నటన అంటే తనకు పిచ్చి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నాకు అవకాశం ఇస్తే పూరీ జగన్నాథ్ సినిమాలో నటించాలనుందని అలాగే రాజమౌళి సినిమాలో ఒక చిన్న పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ తన మనసులోని మాటను ప్రేక్షకులతో పంచుకుంది.































