Surya Kiran: సినీ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సూర్య కిరణ్ ఒకరు. ఈయన నటుడిగా ఇండస్ట్రీలో సుమారు 200 కు పైగా సినిమాలలో నటించారు. అనంతరం సుమంత్ హీరోగా నటించిన సత్యం అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇలా దర్శకుడుగా వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు.

ఇలా ఇండస్ట్రీలో డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో ఈయన నటి కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ పలు సినిమాలలో బిజీ అయ్యారు. అయితే వీరిద్దరూ నిర్మాతలగా మారి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు. అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి దీంతో ఆస్తులను కూడా అమ్ముకున్నారు.
ఇలా ఆస్తులు అమ్మడం నష్టాలు పాలు కావడంతో కళ్యాణికి తన భర్తతో మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు ఇలా తన భార్య తనకు కావాలని ఈయన కోరుకున్నప్పటికీ కళ్యాణి మాత్రం ఈయన నుంచి దూరంగా వెళ్లిపోయారు.. అయితే ఈయన అనారోగ్యానికి గురై జాండీస్ తో బాధపడుతూ చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు.
ఒంటరితనమే చంపేసింది..
ఇక ఈయన మరణ వార్త గురించి నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. సూర్య కిరణ్ చనిపోయింది అనారోగ్య సమస్యతో కాదని ఆయన ఒంటరితనమే తనని చంపేసిందని తెలిపారు. కళ్యాణిని ఎంతో ప్రేమించారు. అయినా తను కాదనుకొని వెళ్లిపోవడంతో మందుకు బానిసగా మారిపోయాడు. రాత్రంతా తాగుతూనే ఉంటే ఏ ఆరోగ్యం కూడా సహకరించదని దాంతో ఈయన అనారోగ్యానికి గురై చనిపోయారు అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































