బుల్లితెర అందగాడిగా, శోభన్ బాబుగా ఎంతో పేరు సంపాదించుకున్న నటుడు పరిటాల నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించిన కార్తీకదీపం సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే కార్తీకదీపం సీరియల్లో ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ బాబు కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

సినిమాకు టెలివిజన్ కు మధ్య చాలా తేడా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖ దర్శకులు టీవీ సీరియల్స్ చూస్తుంటారు. అయితే ఈ సీరియల్స్ లో బిజీగా ఉండటం వల్ల సినిమాల్లో నటించరనే అపోహ వారిలో ఉందేమో తెలీదు కానీ చాలామంది దర్శక నిర్మాతలు బుల్లితెర నటులను సంపాదించరు. అందుకే బుల్లితెర నటులకు ఎక్కువగా సినిమా అవకాశాలు రావు.
ఈ క్రమంలోనే తనకు వెండి తెరపై కనిపించాలనే కోరిక ఉందని , అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని, అయితే ఇది వదులుకొని అటువైపు వెళ్ళనని అని డాక్టర్ బాబు తెలియజేశారు. ఇక జీవితంలో పది సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూసుకుంటే నా జీవితం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.10 సంవత్సరాల క్రితం చంద్రముఖి సీరియల్ లో నటించడానికి ఒప్పుకోకుండా ఉండి ఉంటే ఇప్పటి వరకు సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉండేవాడినని తెలిపారు.
చంద్రముఖి సీరియల్ నా లైఫ్ నా లైఫ్ పార్టనర్ అయిందని ఈ సందర్భంగా డాక్టర్ బాబు తెలియజేశారు. ఈ క్రమంలో నీ జీవితంలో ఎప్పుడైనా మోసపోయారా… అనే ప్రశ్న ఎదురుకాగా, జీవితంలో ఒకే ఒక్కసారి మోసపోయాను. కమర్షియల్ గా నన్ను ఎంతో దారుణంగా మోసం చేశారని చెప్పిన డాక్టర్ బాబు వారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు.































