బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. కథ మొత్తం ట్విస్ట్ లతో ఉండగా ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు కూడా తెగ ఎదురు చూస్తున్నారు. పైగా రేటింగ్ కూడా మొదటి స్థానంలో ఉంది.

ఇక ఈ రోజు ఎపిసోడ్ లో హైలెట్ సీన్స్ ఏంటో చూద్దాం. దీప కార్తీక్ ని చూడటానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక కార్తీక్.. నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీకు కష్టాలే కానుకగా ఇచ్చాను..ఇంకా ఇంకా ఏడువకు దీప అంటూ.. ఆ కన్నీటి శాపం తగిలి.. ఇలా కటకటాల వెనక ఉన్నాను అంటాడు.

ఈ మాటలు విన్న దీప ఏడుస్తూ కుమిలిపోతుంది. ఇక కార్తీక్ నా తరఫున ఒక సాక్ష్యం కూడా లేదు అంటూ ఎవరు వాదిస్తారు అని.. ఇక దీపను ప్రశాంతంగా ఉండమని .. పిల్లలను జాగ్రత్తగా చూసుకో అని ధైర్యం ఇస్తాడు.

ఇక దీప కార్తీక్ మాటలకు మొత్తం అప్పగింతలు పూర్తయినట్లేనా డాక్టర్ బాబు అంటూ ఏడుస్తుంది. అంతలోనే రోషిణి రావడంతో.. దీపను తన క్యాబిన్ కి పిలుస్తుంది.దీప అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

మరోవైపు ఆనందరావు బాధపడుతూ.. కార్తీక్ మనసు విసిగిపోయింది సౌందర్య.. వాడి మనసు అలా మారడానికి కారణం నేనేమో అని గిల్టీగా ఉంది అంటూ తెగ బాధపడతాడు. ఇక సౌందర్య మధ్యలో మీరేం చేశారు అని అంటూ ప్రశ్నిస్తుంది.

గతంలో మౌనిక ప్రెగ్నెంట్ అన్నప్పుడు కార్తీక్ తో ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేదని.. అక్కడినుంచి కోపంతో వెళ్లగొట్టానని అంటాడు. ఇక సౌందర్య మీరు ఓ తండ్రిగా సరిగానే స్పందించారు.. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకి శిక్షించే అర్హత ఉంటుందని అంటుంది.

కార్తీక్ మర్డర్ చేయలేదు అని దీపా అంటుంది. మరి మోనిత ఏమైనట్టు అనగా.. వెంటనే ఆనందరావు.. దీప వాడిని బాగా నమ్ముకుంది అంటాడు. పైగా నెగిటివ్గా ఆలోచిస్తే నెగటివ్ గా ఉంటుందని.. అందుకే పాజిటివ్గా ఆలోచిస్తుంది అని అంటాడు.

మరోవైపు రోషిణి.. దీపల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మీ ఆయనతో మోనిత బాడీ ఎక్కడ ఉందో చెబితే శిక్ష తగ్గిస్తాను అంటూ అప్పుడు మీ పిల్లలతో సంతోషంగా ఉంటారని అంటుంది.

మరోవైపు ఆనందరావు, ఆదిత్య హాస్పిటల్ నుంచి రాగానే ఆనందరావు ఏడుస్తాడు. కార్తీక్ గురించి హాస్పిటల్ లో చాలా నీచంగా మాట్లాడుతున్నారు అని బాధ పడతాడు. అంతలోనే దీపా వచ్చిఆ మాటలు వింటుంది.

నా భర్త తప్పు చేయలేదని.. మీరందరే ఆయనను అనుమానిస్తున్నారు అని వారితో అంటూ బాధపడుతుంది. నా భర్తకు శిక్ష పడకుండా నేను చూసుకుంటాను అంటూ.. న్యాయం కోసం పోరాడుతానని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఇక కార్తీక్ దగ్గరికి రత్న సీత వచ్చి తన భర్తకు గుండె బరువు ఉందని అందుకు మందులు ఇవ్వమని అడిగేసరికి వెంటనే కార్తీక్ మందులు రాసి ఇస్తాడు. ఇక రత్న సీత కార్తీక్ భోజనం ఇస్తుంది.

ఇక కార్తీక్ రత్న సీత అడక్కుండానే అన్నీ ఇస్తున్నావ్.. నేను ఏమి అవుతానని ఇవన్నీ చేస్తున్నావ్ అడిగేసరికి.. మీరు మంచి వ్యక్తులని.. మీ గురించి విన్నాను కానీ.. మీపై ఇలాంటి నేరం ఎలా జరిగిందో అని అనగా.. వెంటనే కార్తీక్ నేను నేరాలు చేయలేదు పాపాలు చేశాను అనుకుంటాడు.

ఇక తరువాయి భాగంలో అంజి.. దీపకు నేను కాకుండా మోనితకు మరో శత్రువు ఉన్నారేమో..మోనితను చంపి కార్తీక్ పై నింద వేశారేమోనని అనేసరికి వెంటనే దీపకు ఓ అమ్మాయి గుర్తొచ్చి ఓ శత్రువు ఉంది అంటుంది. ఇక మోనితను కూడా చూపిస్తారు. దీనిబట్టి మోనితను చంపింది ఆ అమ్మాయేమో అని అనుమానాలు వస్తున్నాయి.

































