బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ సామాన్యులే కాకుండా సెలబ్రిటీలను కూడా అభిమానులుగా మార్చుకుంది. ఇక ఈ సీరియల్ ను అసలు మిస్ చేసుకోవడం లేదనే చెప్పాలి. రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది.

ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం. మోనిత.. గతంలో కార్తీక్ తనపై మండిపడ్డ విషయాన్ని, ఆ గన్ తో తానే కావాలని కాల్చుకోవడం, కత్తితో గాయపరచడం అన్ని చూశాము. కార్తీక్ ఫోటోను చూసుకుంటూ ఇదంతా కావాలని చేయలేదంటూ.. దీప మీద కోపంతో చేశానని మాట్లాడుకుంటుంది. నిన్ను సొంతం చేసుకునేదాకా వదలను.. దీపను వదలను అంటూ ఫోటోను హత్తుకుంటుంది.

ఇక పోలీస్ స్టేషన్ లో పిల్లలిద్దరూ తన తండ్రిని చూసి ఏడుస్తుంటారు. నువ్వేంటి ఇక్కడ అంటూ లోపల వైపు చూస్తుంటారు. ఏసీ లేకుండా ఎలా ఉన్నారు.. ఎప్పుడు ఇలానే ఉంటారా..మీరేమైనా దొంగల అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు.

వెంటనే కార్తీక్ నన్ను పిల్లలు ఇలా చూస్తే తట్టుకోలేరుని తెలీదా అని దీపను ప్రశ్నిస్తాడు.ఒట్టు పెట్టుకున్నారని తప్పలేక అని అంటుంది. ఇక పిల్లలు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంటారు. వెంటనే శౌర్య ఓ పోలీస్ దగ్గరికి వెళ్లి మా నాన్నని కాసేపు బయటికి పంపించు అనేసరికి.. ఆ పోలీస్ మేడం ఏమంటుందో అని అంటాడు.

పిల్లల బాధను చూడలేక రత్న సీత అతడిని బతిమాలి కార్తీక్ ను బయటకు తీసుకొస్తుంది. ఇక పిల్లలను పట్టుకొని దగ్గరకు తీసుకుంటాడు. ఏడవకండి అని ఊరుకోబెడతారు. ఇక పోలీసును చూసి అలా బెదిరిస్తున్నాడు ఏంటి ఆ మీసాలైనా.. అనేసరికి వెంటనే రత్న సీత పిల్లల మాటలు పట్టించుకోకు అని అంటుంది.

రత్న సీత పిల్లలకు మంచినీళ్లు ఇవ్వడంతో శౌర్య థాంక్స్ అని చెబుతోంది. వెంటనే మీకు అక్క లాంటిదాన్నే బంగారం అని అనడంతో కార్తీక్ కాస్త ఎమోషనల్ గా చూస్తాడు. అక్కా మా నాన్నను ఇంటికి తీసుకెళ్లి రేపు వస్తాను అని అనడంతో కుదరదు అని చెప్పడంతో వాళ్లపై అరుస్తుంది శౌర్య.

మా నాన్న ఏం తప్పు చేశాడు అని అనడంతో వెంటనే పోలీస్ ఎక్కడ నిజం చెబుతాడో అని శౌర్యను పక్కకు తీసుకొస్తుంది దీప. దీప పై కూడా అరుస్తుంది. ఇక పిల్లలు మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నానమ్మ చూసి కూడా ఎలా ఊరుకున్నారు అని ప్రశ్నలు వేస్తుంది శౌర్య.

అదే సమయంలో రోషిణి ఎంట్రీ ఇవ్వడంతో రత్న సీతపై అరుస్తుంది. స్టేషన్ అనుకుంటున్నారా.. క్యాంటీన్ అనుకుంటున్నారా అని కోపంతో రగిలిపోతుంది. ఎవర్ని ఎక్కడ ఉంచాలో తెలియదా అంటూ తన మాటలతో బాగా ఫైర్ అవుతుంది. ఇక కార్తీక్ సారీ చెబుతాడు.

రోషిణి మాటలను విన్న శౌర్య కోపంతో చూస్తుంది. ఈ మేడం లాగా అందర్నీ కమాండ్ చేయాలంటే ఏం చేయాలి నాన్న అని ప్రశ్నిస్తుంది. ఐపీఎస్ చదవాలి అనేసరికి వెంటనే ఐపీఎస్ అవుతానని అంటుంది. ఇక ఆ మాటలకు కూడా రోషిణి కాస్త వ్యతిరేకంగా మాట్లాడుతూ అక్కడనుండి వెళ్లి పోతుంది.

మరోవైపు దీపకు.. భాగ్యం ఫోన్ చేసి కార్తీక్ బాబు కోసం గుడికి వెళదామని అనేసరికి వెళ్దాం పిన్ని అని అంటుంది. ఇక సౌందర్య, ఆనందరావు ఫోన్ లలో ఆఫీసర్ లతో మాట్లాడుతారు. బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తారు.అంతలోనే దీప సౌందర్యకు ఫోన్ చేసి రోషిణి గురించి మాట్లాడుతుంది.

ఇక మోనిత మొఖానికి పసుపు పెట్టుకొని గుర్తుపట్టన్ని లుక్ తో గన్ పట్టుకొని సోది చెప్పే దానిలా తయారవుతుంది. మొత్తానికి మోనిత దీపను చంపడానికి బయలుదేరుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ సారి దీప మోనిత నుండి తన ప్రాణాలు ఎలా కాపాడుకుంటుందో చూడాలి.

































