స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీరియల్ లోని వంటలక్క, డాక్టర్ బాబు, సౌందర్య, హిమ, శౌర్య పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఏళ్లు గడుస్తున్నా ఈ సీరియల్ రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటూ స్టార్ మా ఛానెల్ ను నంబర్ 1 స్థానంలో నిలుపుతోంది.

ఈ సీరియల్ లో అత్త సౌందర్య పాత్రలో నటించిన అర్చనా అనంత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితం. వయస్సు తక్కువే అయినా తల్లి, వదిన తరహా పాత్రల్లో ఆమె ఎక్కువగా నటిస్తున్నారు. ప్యాషన్ డిజైనర్ గా కెరీర్ ను ప్రారంభించిన అర్చన అనంత్ ఊహించని విధంగా నటిగా వరుస అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. స్టార్ మా ఛానెల్ లో కార్తీకదీపం సీరియల్ తో పాటు కేరాఫ్ అనసూయ అనే మరో సీరియల్ లో కూడా ఆమె నటిస్తున్నారు.

అయితే అర్చనా అనంత్ చేసిన మొదటి పాత్ర గురించి తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అర్చన నటిగా మారడానికి గల కారణాలను వెల్లడించారు. ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తున్న సమయంలో ఒక కన్నడ ప్రాజెక్ట్ కోసం అడిషన్ ఇవ్వమని కోరారని.. అడిషన్ లో పాల్గొంటే ఊహించని విధంగా పాత్రకు ఎంపికయ్యానని అన్నారు. అందరూ చెబితే నవ్వుతారు కానీ తన తొలి పాత్ర శవంలా పడుకునే పాత్ర అని తెలిపారు.

ఆ ప్రాజెక్ట్ కెమెరామెన్ తన తండ్రికి స్నేహితుడని అందువల్ల తానేం మాట్లాడలేకపోయానని అన్నారు. అలా నటనా ప్రయాణం ప్రారంభమైందని.. తెలుగులో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కూడా చేశానని ఆమె చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here