ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత టెస్టు జట్టులో ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ నిరాశపరిచాడు. రాక రాక అవకాశం వస్తే.. కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి డకౌట్ కావడం అభిమానులను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. హెడింగ్లీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఓలీ పోప్ అందించిన క్యాచ్‌కు కరుణ్ బలయ్యాడు. ఇప్పుడు ఇదే నెటిజన్ల ట్రోల్స్‌కు బీజం వేసింది.

శుభ్‌మన్ గిల్ (147) ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్, అప్పటికే భారత స్కోరు 430/4గా ఉండడంతో ఒత్తిడి లేకుండా, స్థిరంగా ఆడే అవకాశం అతనికి లభించింది. కానీ అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి, తాను సాధించవచ్చిన అవకాశాన్ని చేతులారా వదులుకున్నాడు. ఇదే సమయంలో పంత్ గ్రౌండ్‌లో దూకుడుగా ఆడుతుండగా, కరుణ్ మాత్రం తక్కువ సమయం ఉండగానే పెవిలియన్ వెనుతిరిగాడు.
Karun Nair falls for a duck in his comeback Test after 8 years 😔🦆
— CricTracker (@Cricketracker) June 21, 2025
📸: Jio Hotstar#KarunNair #ENGvsIND pic.twitter.com/xMEFeqxAXd
ఈ పరాభవంతో రెండో ఇన్నింగ్స్‌కు భారత్ బాటింగ్ చేయకపోతే, నాయర్ మరోసారి అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే జట్టులో అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ రెడ్డి లాంటి యువ ఆటగాళ్లు తమ చాన్స్ కోసం ఎదురు చూస్తుండటంతో, కరుణ్ స్థానం మరింత ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ట్వీట్ వైరల్ అవుతోంది: “ఓర్నీ ఎనిమిదేళ్ల తర్వాత అవకాశం వస్తే ఇలాగానా ఆడతావా..? ఇంకెవరైనా ఆ ఛాన్స్‌కి తగిన న్యాయం చేశారు” అని చెప్పాడు.. ఈ ట్వీట్ కి భారీ పెద్ద ఎత్తున స్పందన వస్తుంది.
God can give you a chance but it is up to you whether you make it or waste it .#karunnair #INDvsENG https://t.co/locKgFNLYt pic.twitter.com/lkGBXj2xhL
— 𝐀𝐧𝐤𝐢𝐭 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 𝕏 (@Ankit_S1111) June 21, 2025
One Debutant and another guy who made a comeback, both for duck… Rest all batters had a good game.
— arfan (@Im__Arfan) June 21, 2025





























