ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన కెసిఆర్ భార్య శోభ.. కుటుంబం మొత్తం ఢిల్లీలోనే..!

0
237

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గతంలో ఈమె కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈమెకు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని పలు ఆసుపత్రిలో ఈమెకి చికిత్స చేయించినప్పటికీ కొందరు డాక్టర్ల సూచన ప్రకారం ఢిల్లీ
ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాను కలవమని సలహా ఇచ్చారు.

ఈ క్రమంలోనే తన కొడుకు కేటీఆర్ కూతురు కవితతో కలిసి కేసీఆర్ సతీమణి శోభ శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు.పరీక్షల నిమిత్తం వీరు శనివారం తిరిగే హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా పరీక్ష ఫలితాలను చూసిన అనంతరం డాక్టర్ ఇన్ పేషెంట్ గా ఆస్పత్రిలో చేరాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలోనే డాక్టర్ల సూచన మేరకు ఈమె ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

ఇక విషయం తెలిసిన కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఇలా కుటుంబం మొత్తం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఇకపోతే ఈమెను కేవలం అబ్జర్వేషన్ లో ఉంచడం కోసమే అడ్మిట్ చేశారని శోభమ్మ ఆరోగ్య విషయంలో ఏ మాత్రం కంగారు పడాల్సిన పని లేదని వైద్యులు వెల్లడించారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన వెంటనే ఆయన సతీమణి శోభమ్మ, కొడుకు కేటీఆర్, కూతురు కవిత కూడా కరోనా బారినపడ్డారు. అయితే వీరందరూ కోలుకున్నప్పటికీ కేసీఆర్ సతీమణి మాత్రం ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడటం వల్ల ఈమెకు ఢిల్లీలోని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here