ఆ ఊర్లో టీవీ, ఇంటర్నెట్ లేవు.. అందుకే ఒక్క కరోనా కేసు కూడా లేదు!

0
279

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోన విలయతాండవం చేస్తుంటే ఆ గ్రామంలో మాత్రం ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే అది ఒక మారుమూల గ్రామం అనుకుంటే పొరపాటు. అదొక పర్యాటక ప్రదేశం అయినప్పటికీ ఆ గ్రామ ప్రజలు ఉన్న నిబద్ధత వల్ల ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఎంతో విశేషం. అభివృద్ధికి దూరంగా ఉన్న ఆరోగ్య ‘గని’ గా పేరుగాంచింది కేరళలోని గవి గ్రామం.

పతనంతిట్టా జిల్లా సీతాతోడు పంచాయతీలోని గవి గ్రామ జనాభా 1000. వీరిలో 163 మంది మాత్రమే స్థానిక గిరిజనులు కాగా మిగిలిన వారందరూ వలస వచ్చిన వారే. ఆ గ్రామంలోని ప్రజలందరూ ముక్కు పైకి మాస్క్ వేసుకొని, పక్క ఇంటి గడప తొక్కకుండా ప్రతి ఒక్కరూ నిర్బంధంలో ఉంటూ,కరోనా నిబంధనలను పాటించడం వల్ల ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

ప్రతివారం ఆ గ్రామానికి వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్న ఆ గ్రామంలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏవిధంగా కోరలు చాస్తుందో ఆ గ్రామానికి తెలియదు. ఎందుకంటే ఆ గ్రామానికి టీవీలు లేవు, ఇంటర్నెట్ సౌకర్యాలు లేవు. కేవలం అధికారులు దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడంతోనే ఆ గ్రామస్తులు అందరూ క్రమశిక్షణతో మెలుగుతున్నారు.

అయితే కరోనా రెండవ దశ వ్యాపించినప్పుడు వలస కూలీలు ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.అయితే ఆ వ్యక్తిని క్వారంటైన్ తరలించి గ్రామ ప్రజలందరికీ కౌన్సెలింగ్ నిర్వహించగా వారందరూ నిర్బంధంలోకి వెళ్లారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామంలో కేసులు నమోదు కాకపోవడం విశేషం అని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here