బాలీవుడ్‌లోని ప్రముఖ జంట సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. కియారా తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంటకు ఇది తొలి సంతానం కావడం విశేషం. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అని సమీప వర్గాలు వెల్లడించాయి. ఈ శుభవార్తతో సిద్ధార్థ్, కియారా కుటుంబాల్లో ఆనందం అలలెత్తుతోంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.

ఇప్పటికీ ఈ జంట తమ సంతోషాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇప్పటికే ఫిబ్రవరి 28న తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పుడు ఆ శుభముహూర్తం నెరవేరింది.
హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో డెలివరీ :
డెలివరీ కోసం కియారాను ముంబై గిర్గావ్‌లోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె బిడ్డకు జన్మనిచ్చారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, సిద్ధార్థ్ – కియారా జంట 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ జంట తమ వ్యక్తిగత జీవితం గురించి చాలా ప్రైవేటుగా ఉండడమే కాక, ఇప్పుడు తమ ఆనందాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదిస్తున్నారు.
Kiara Advani and Sidharth Malhotra welcome a baby girl
— Nandini Chaar (@ndccomputers) July 15, 2025
Kiara Advani and Sidharth Malhotra welcomed their first child today. The couple was blessed with a baby girl. pic.twitter.com/0GfEIgcMJc































