Kiran Abbavaram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి వారిలో నటుడు కిరణ్ అబ్బవరం ఒకరు.తాజాగా ఈయన మీటర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఏప్రిల్ ఏడవ తేది విడుదలకు సిద్ధమవడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులతో, నేటిజన్స్ తో చిట్ చాట్ చేస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా కొందరు రవితేజ అభిమానులు కిరణ్ అబ్బవరాన్ని షాకింగ్ ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెట్టారు.
రవితేజ నటించిన రావణాసుర సినిమా కూడా ఏడవ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో కొందరు రవితేజకు పోటీగా మీ సినిమాను విడుదల చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అదేం లేదు అంటూ ఈయన రిప్లై ఇచ్చారు.మరొక నెటిజన్ అయితే నీకు రవితేజతో పోటీ అవసరమా అంటూ కామెంట్లు చేయగా ఈ ప్రశ్నకు కూడా ఈయన చాలా కూల్ గా సమాధానం చెప్పారు.

Kiran Abbavaram: అనుకోకుండా జరిగింది…
రవితేజ రావణాసుర కిరణ్ అబ్బవరం మీటర్ రెండు ఒకేరోజు విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రశ్న వేశారు.అయితే అందుకు హీరో రిప్లై ఇస్తూ ఇది అనుకోకుండా జరిగిందని తను కూడా ఈ విషయాన్ని అసలు ఊహించలేదు అంటూ సమాధానం చెప్పారు.ఏది ఏమైనా ఇలా నేటిజన్ అడిగిన ప్రశ్నకు ఈయన చాలా కూల్ గా సమాధానం చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.































