Drinking water: ఈ పదార్థాలు తింటే పొరపాటున కూడా నీళ్లు తాగకూడదు… తాగితే అంతే సంగతులు?

0
260

Drinking water:మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే మన శరీరానికి సరిపడా నీరు ఎంతో అవసరం అనే విషయం మనకు తెలిసిందే. అందుకే అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇకపోతే మనం ఏదైనా ఆహార పదార్థాలను తిన్న వెంటనే ప్రతి ఒక్కరికి నీళ్లు తాగడం అలవాటుగా ఉంటుంది.కానీ కొన్ని ఆహార పదార్థాలను తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.

చాలామంది భోజనం చేసిన వెంటనే గబగబా నీళ్లు తాగుతారు.కానీ భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాక జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి అందుకే భోజనం చేసిన అరగంట తర్వాత నీళ్లు తాగడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా నీళ్లు కలిగిన పండ్లను తిన్న తర్వాత తిరిగి నీటిని తాగకూడదు.

ఇలా వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బ తినడంతో పాటు ఆహారం జీర్ణం కాకుండా ఉంటుంది. తద్వారా జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. ఇక నీళ్ళు కలిగిన పుచ్చకాయ, కీరదోస, నారింజ వంటి పండ్లను తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు అని నిపుణులు చెబుతున్నారు.

ఊబకాయానికి కారణం అవుతుంది…

ఆయుర్వేదం ప్రకారం మనం తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల అది జీర్ణక్రియ వ్యవస్థను నాశనం చేయడమే కాకుండా ఊబకాయానికి దారితీస్తుందని చెప్పవచ్చు.ఇక పళ్ళలో అధిక శాతం నీటిని కలిగి ఉండి అలాంటి పండ్లను తిన్న తర్వాత తిరిగి నీటిని తాగడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది.అదేవిధంగా చెరుకు తిన్న తరువాత నీటిని తాగకూడదు చెరువులో క్యాల్షియం పొటాషియం అధికంగా ఉండటం వల్ల వెంటనే నీటిని తాగటం వల్ల మన నోటిలో పగుళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.