Krishna -Jeetendra: తెలుగు చిత్రపరిషంలో సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రస్థానం ఏంటో మనకు తెలిసింది ఈయన దర్శకుడుగా నిర్మాతగా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.అయితే ఈయన తెలుగులో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలను ఎక్కువగా హిందీలో రీమేక్ చేశారు ఇలా కృష్ణ సినిమాలను రీమేక్ చేసిన వారిలో బాలీవుడ్ నటుడు జితేంద్ర ఒకరు. మరి ఈయన కృష్ణ నటించిన ఏ సినిమాలను రీమేక్ చేశారని విషయానికి వస్తే…

- గూఢచారి 116 కృష్ణ నటించిన ఈ చిత్రాన్ని జితేంద్ర ఫర్జ్ అనే టైటిల్ తో హిందీలో రీమేక్ చేశారు.
- నేనంటే నేనే చిత్రాన్ని జితేంద్ర హిందీలో వారిస్ అనే పేరుతో తెరకెక్కించారు.
- పచ్చని సంసారం చిత్రాన్ని కృష్ణ లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో నటించారు. ఈ చిత్రాన్ని హిందీలో జితేంద్ర హిమ్మత్ ఔర్ మెహనత్ టైటిల్ తో రీమేక్ చేశారు.
- ధీర్ఘసుమంగళి చిత్రాన్ని జితేంద్ర హిందీలో సదా సుహాగన్ టైటిల్ తో రీమేక్ చేశారు.
- అంతం కాదిది ఆరంభం విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ నటించిన ఈ చిత్రాన్ని హిందీలో మేరీ ఆవాజ్ సునో అనే పేరుతో రీమేక్ చేశారు.
*దేవుడు చేసిన మనుషులు కృష్ణ ఎన్టీఆర్ మల్టీ స్టార్ చిత్రంగా పద్మాలయ స్టూడియో స్కానర్లు నిర్మించిన ఈ చిత్రాన్ని హిందీలో టక్కర్ పేరిట విడుదలైంది.

Krishna -Jeetendra:
రహస్య గూఢచారి కే.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని హిందీలో జితేంద్ర రక్ష పేరుతో రీమేక్ చేశారు.
ఊరికి మొనగాడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని హిందీలో హిమ్మత్ వాలా పేరిట విడుదల చేశారు.
ముందడుగు కృష్ణ శోభన్ బాబు మల్టీ స్టార్ చిత్రంగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లు తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీలో మక్సద్ పేరిట రీమేక్ చేశారు.
ఈనాడు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన 200వ చిత్రం హిందీలో యే దేశ్ గా రీమేక్ అయింది.
చుట్టాలున్నారు జాగ్రత్త సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ సినిమాని హిందీలో మవాళి పేరిట విడుదల చేశారు.
అడవి సింహాలు సూపర్ స్టార్ కృష్ణ,రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోలుగా కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని హిందీలో జానీ దోస్తీ పేరుతో విడుదల చేశారు.
శక్తి కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు హిందీలో కామియాబ్ పేరుతో విడుదల చేశారు.
సింహాసనం సూపర్ స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో ఆయనే హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమాని హిందీలో సింఘాసన్ పేరిట విడుదల చేశారు.



































