Krishna vamsi: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి పరిచయం అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో అగ్ర హీరోలు అందరూ నటించి ఎంతో మంచి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈయన చివరిగా నక్షత్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన ప్రస్తుతం రంగమార్తాండ అనే సినిమా చేస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈయన పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున తన సినిమాల గురించి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.
ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న కృష్ణవంశీ రమ్యకృష్ణతో తనకు విభేదాలు వచ్చాయన్న వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.సెలబ్రిటీలన్న తర్వాత ఇలాంటివి రావడం సర్వసాధారణం అసలు మేము వాటి గురించి ఏమాత్రం పట్టించుకోమని తెలిపారు. ఇకపోతే రమ్యకృష్ణ గురించి యాంకర్ ప్రశ్నిస్తూ తను ఇలాగే ఉండాలి అని కండిషన్లు పెడుతుందా అంటూ ప్రశ్నించారు.

Krishna vamsi: ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటుంది…
ఈ ప్రశ్నకు కృష్ణ వంశీ సమాధానం చెబుతూ తను నాకు ఏ విషయాలలోనూ అడ్డు చెప్పదు కానీ ఫుడ్ విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు చెబుతుంది. ఇలాంటి విషయాలలో నేను తనని గుడ్డిగా ఫాలో అవుతాను. ఆమె నా ఏంజెల్ ఆమె ఏం చేసినా అందంగా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా కృష్ణవంశీ రమ్యకృష్ణ గురించి మాట్లాడుతూ తనపై ఎంత ప్రేమ ఉందో బయటపెట్టారు. ఇలా రమ్యకృష్ణ గురించి కృష్ణవంశీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
































