Krishna vamsi: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత కృష్ణవంశీకి ఉందని చెప్పాలి.ఈయన ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇకపోతే 2017 లో నక్షత్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన అనంతరం ఎలాంటి సినిమాలను చేయలేదు.

ఈ క్రమంలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ తన పెళ్లి విడాకుల గురించి వచ్చిన వార్తలపై స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ..రమ్యకృష్ణ తన కుమారుడి ఇద్దరు చెన్నైలో ఉంటున్నారని తాను మాత్రం సినిమా షూటింగ్ పనులలో భాగంగా హైదరాబాద్లో ఉంటున్నానని తెలిపారు.ఇలా నేనిక్కడ వాళ్లు అక్కడ ఉండటం వల్ల చాలామంది మేం విడాకుల తీసుకొని విడిపోయాము అందుకే విడిగా ఉంటున్నామని భావిస్తున్నారు.

Krishna vamsi: గాసిప్స్ అంటే అందరికీ ఇష్టమే కదా…
మేమిద్దరం విడిగా ఉంటున్న మాట నిజమే కానీ సినిమా షూటింగ్ పనుల వల్ల ఇలా ఉండాల్సి వచ్చిందని అంతకుమించి ఎలాంటి గొడవలు లేవని ఈయన తెలిపారు.సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఇలాంటి గాసిప్స్ రావడం సర్వసాధారణం అయితే మేము వాటి గురించి పట్టించుకోమని గాసిప్స్ అంటే కూడా అందరికీ ఎంతో ఇష్టం కనుక ఇలాంటివి క్రియేట్ చేస్తూ ఉంటారని ఈ సందర్భంగా కృష్ణవంశీ రమ్యకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.