Kriti Sanon: రాముడిలాగే ప్రభాస్ మంచివాడు… ప్రశంసలు కురిపించిన కృతి సనన్!

0
21

Kriti Sanon: కృతి సనన్ ప్రభాస్ జంటగా ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి గతంలో టీజర్ పోస్టర్లు విడుదల చేయగా ఈ టీజర్ తీవ్ర స్థాయిలో వివాదాలకు కారణమయ్యాయి.

ఈ సినిమా నుంచి టీజర్ కనుక చూస్తే చిన్న పిల్లలు కార్టూన్ ఛానల్ చూసినట్టు ఉందంటూ ఎన్నో విమర్శలు వెళ్లిపోతాయి అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఒక విజువల్ వండర్ లా ఉందని చెప్పాలి టీజర్ తో పోలిస్తే ట్రైలర్ 100 రెట్లు మెరుగ్గా ఉందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ టీజర్ లో సీతను రావణాసురుడు ఎత్తుకెళ్లిపోవడం శబరి ఎంగిలి పనులను రాముడు తినడం హనుమంతుడు సీత కోసం వెతకడం, హనుమంతుడు లంకకు నిప్పు పెట్టే వంటి సన్నివేశాలు అన్నింటినీ ఎంతో అద్భుతంగా చూపించారు. ఇలా ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా కృతి సనన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రశంసల కురిపించారు.

Kriti Sanon: ప్రభాస్ ప్రశంసలు కురిపించిన కృతి సనన్..

రాముడు లాగే ప్రభాస్ కూడా చాలా మంచివాడు అంటూ తనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా ప్రభాస్ గురించి కృతి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, మాల్దీవ్స్ లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలను ఇటు ప్రభాస్ టీం అలాగే కృతి టీం ఇద్దరు కూడా ఖండించారు.