Lalitha Jewellery Owner: లలిత జ్యువెలర్స్ ఓనర్ ఎండి కిరణ్ అంటే అందరికీ ఎంతో సుపరిచితమే. డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే ఒక డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 45 బ్రాంచ్లను ఏర్పాటు చేసి కస్టమర్లకు వివిధ రకాల డిజైన్లు నగలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో షో రూమ్లను ఏర్పాటు చేసిన ఈయన తాజాగా చిత్తూరులో కూడా లలిత జ్యువెలరీ షోరూం ఏర్పాటు చేశారు. ఇలా ఈ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ షో రూమ్ ను ప్రముఖ నటి మంత్రి రోజా చేతుల మీదగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈయన నటి రోజా గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఎండీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తన షోరూం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మంత్రి రోజా గారికి ధన్యవాదాలు తెలియజేశారు. తన షోరూం ప్రారంభోత్సవానికి తన టీం తో కలిసి రోజా గారిని ఆహ్వానించడానికి వెళ్ళామని తెలిపారు. అయితే ఆమె మా అందరికీ ఎంతో సాదరంగా ఆహ్వానం పలికి ఎంతో మర్యాద చేయడమే కాకుండా విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారనీ ఎండి కిరణ్ వెల్లడించారు.

Lalitha Jewellery Owner: ఆ కిక్కే వేరు….
ఇలా రోజా గారు తమతో మంచిగా మాట్లాడి తమకు మర్యాదలు చేయడం ఎంతో గొప్ప విషయమని ఇది ఆమె గొప్పతనం అంటూ ఈయన తనపై ప్రశంసలు కురిపించారు. ఇలా మనకు నచ్చిన వ్యక్తులు షోరూం ఓపెన్ చేయడం ఎంతో మంచి కిక్ ఇస్తుందని ఈ సందర్భంగా ఈయన రోజా గారికి ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా తన మంచి మనసుపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.