Viral: ఆ కుర్చీ మడత పెట్టి అనే డైలాగుతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు తెలంగాణకు చెందిన షాషా అనే తాత. ఈయన గత కొన్ని నెలల క్రితం తెలంగాణలో రాజకీయాల గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుర్చీ మడతపెట్టి అంటూ చెప్పినటువంటి డైలాగ్ పెద్ద ఎత్తున ఫేమస్ అయ్యింది. ఈ డైలాగ్ ఎంతలా ఫేమస్ అయ్యింది అంటే ఏకంగా మహేష్ బాబు సినిమాలో పాట పెట్టే అంతగా ఫేమస్ అయ్యింది.

ఇక ఈ డైలాగ్ తో తాత కూడా బాగా ట్రెండ్ అవుతున్నారు. ఇక మహేష్ బాబు సినిమాలో కుర్చీ మడత పెట్టు అనే పాట రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ తాత మరింత వైరల్ అవ్వడమే కాకుండా వరుస ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నారు.ఇలా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి కుర్చీ తాత ఈ సినిమాలో తన డైలాగ్ చెప్పినటువంటి పాట పెట్టడం చాలా సంతోషంగా ఉందని ఈ పాట తానే పాడాను అంటూ కూడా తెలియజేశారు.

ఇక ఈ పాట పాడినందుకు తనకు లక్ష రూపాయలు ఇచ్చారని చాలా సంతోషంగా ఉంది అంటూ ఈయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాలోని పాట గురించి పలు విషయాలను తెలిపారు. అయితే ఇటీవల కూర్చుతాత ఆర్టీసీ బస్సులలో భిక్షాటన చేస్తూ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.
నన్ను కుర్చీ తాత అంటారు…
ఆర్టీసీ బస్సులలో కుర్చీ తాత భిక్షాటన చేస్తూ నన్ను కుర్చీ తాత అంటారండి ఒక రూపాయి కూడా లేదా అండి అంటూ ఈయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి బిక్షం అడుగుతో కనిపించారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు . పాట పాడి లక్ష రూపాయలు తీసుకున్నటువంటి ఈయనే ఇలా భిక్షాటన చేయడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు. నిజంగానే ఈయన పరిస్థితి ఇలా ఉందా లేకుంటే ప్రమోషన్లలో భాగంగా ఇలా చేస్తున్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది.
వైరల్ అవుతున్న కుర్చీ తాత వీడియో !!#KurchiniMadathapetti #KurchiMadathapetti #KurchiThatha #GunturKaaram pic.twitter.com/0z3TjvRPly
— TeluguDesk (@telugudesk) January 3, 2024






























