Lavanya Tripati:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నారన్న వార్త మెగా అభిమానులలో చాలా సంతోషాన్ని నింపింది.ఈయన గత కొంతకాలంగా నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ వీరు మాత్రం ఈ వార్తల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇకపోతే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగబోతుంది అంటూ వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఈ వార్తలు గురించి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. ఇక తాజాగా రేపే వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థం అంటూ మెగా కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గతంలో పలు ఇంటర్వ్యూలకు హాజరైనటువంటి వీడియోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి మొట్టమొదటి నటించిన చిత్రం మిస్టర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ద్వారా వీరిద్దరూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Lavanya Tripati: బాక్సులు వేసుకొని నిలబడాలి…
ఇందులో భాగంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ హైట్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ ఆరడుగుల ఆజానుబావుడు అనే విషయం మనకు తెలిసిందే. అయితే వరుణ్ తేజ్ హైట్ గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ వరుణ్ పక్కన తాను నిలబడాలి అంటే కింద బాక్సులు వేసుకోవాల్సి ఉంటుంది అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.