Lavanya Tripati -Varun Tej: ప్రస్తుతం మెగా అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఎందుకంటే తొందర్లోనే మెగా కుటుంబానికి వారసుడు రాబోతున్నాడు అన్న సంతోషం ఒకవైపు అయితే.. మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైందన్న సంతోషం మరొకవైపు. ప్రస్తుతము ఉపాసన ఎనిమిది నెలల గర్భంతో ఉంది. మరొక నెలలో ఆమె పండంటి బిడ్డను ప్రసవించనుంది. దీంతో మరొక నెలలో మెగా కుటుంబంలో వారసుడు అడుగుపెడతాడని అభిమానులు ఆనందంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కి హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు.

నాగబాబు నివాసంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు మెగా, అల్లు వారి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ ఏడాది చివరిలో వీరీ పెళ్లి జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా వరుణ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం గురించి గత కొంతకాలంగా అనేక వార్తలు వినిపించాయి. లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరిగిన దగ్గర నుండి కోడలు కాబోతోందని కొందరు ముందే ఊహించారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Lavanya Tripati -Varun Tejలావణ్య పెళ్లి గురించి ఆ సినిమాలో చెప్పారా…
తాజాగా లావణ్య త్రిపాఠి గురించి అల్లు అరవింద్ గతంలో మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని అల్లు అరవింద్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఒక సినిమాలో లావణ్య చెప్పినట్లుగానే ఆమె మెగా ఇంటికి కోడలుగా వెళ్లబోతోంది. అందాల రాక్షసి అనే సినిమాలో ఒక సీన్ లో లావణ్య త్రిపాఠిని పిల్లలు నీ పెళ్లికి చిరంజీవి వస్తాడట నిజమేనా అని అడుగుతారు. అప్పుడు లావణ్య వారితో అవును అంటుంది. ఇప్పుడు నిజంగానే వరుణ్ తేజ్ లావణ్య పెళ్లికి చిరంజీవి పెళ్లి పెద్దగా మారి వారి వివాహం చేయబోతున్నాడు.































