Lavanya Tripati -Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరి కొద్ది రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈయన గత కొన్ని సంవత్సరాల నుంచి నటి లావణ్య త్రిపాటి ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. రహస్యంగా వీరి ప్రేమ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టిన సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు.

ఈ విధంగా గత నెల 9వ తేదీ నిశ్చితార్థం జరుపుకున్న వీరు పెళ్లి పనులు కూడా ప్రారంభించారని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా వీరి వివాహ ముహూర్తాన్ని కూడా ఇరువురి కుటుంబ సభ్యులు నిశ్చయించారని తెలుస్తుంది. వరుణ్ తేజ్ లావణ్యల వివాహం ఆగస్టు 24వ తేదీ జరగబోతున్నట్టు సమాచారం. ఇక వీరి వివాహం ఇటలీలో జరగబోతుందని వీరు డెస్టినేషన్ వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది.
ఇలా ఆగస్టు 24వ తేదీ వీరీ వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని తెలుస్తోంది. అయితే 25వ తేదీ వరుణ్ తేజ్ నటించిన గాండీవదారి అర్జున అనే సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇలా 25వ తేదీ తన సినిమా విడుదలను పెట్టుకొని 24వ తేదీ వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Lavanya Tripati -Varun Tej: ఆగస్టులోనే వివాహం…
అయితే ఈయన వివాహానికి సంబంధించినటువంటి ఈ విషయం త్వరలోనే అధికారకంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి గురించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక వీరిద్దరూ మిస్టర్ అనే సినిమాలో కలిసిన నటించడంతో ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.