ప్రతిరోజు వివిధ రకాల కూరల్లో వాడే కరివేపాకును చాలామంది సువాసన కోసమే అని భావించి తినకుండా పక్కన పడేస్తుంటారు. అది పొరపాటే! ఎందుకంటే కరివేపాకులో మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, క్యాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ ,ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరటిన్,మాంసకృత్తులు,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అలాగే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కరివేపాకును ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్లభవిష్యత్తులో వచ్చే ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

కరివేపాకును ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకులో సమృద్ధిగా ఉన్న విటమిన్ ఎ కంటి సమస్యలను దూరంచేసి కంటిచూపును మెరుగు పరుస్తుంది.అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.నీటిలో కరివేపాకును బాగా మరిగించి కాస్త నిమ్మరసం,చక్కెర కలిపి ‘టీ’ రూపంలో ప్రతిరోజు తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది. అలాగే శరీరంలో మలినాలు తొలగించి అతి బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.
కరివేపాకులో ఉన్న ఔషధగుణాలు క్లోమ గ్రంథిని ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగు పరుస్తుంది.దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి ప్రమాదకర డయాబెటీస్ వ్యాధి నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ పొందవచ్చు. కరివేపాకులో అధికంగా ఉన్న ఐరన్, ఫైబర్, ఫోలిక్‌యాసిడ్ ప్రమాదకర రక్తహీనత, కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యల,గుండె జబ్బులు వంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.































