మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్ నగర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే నిఘోజ్ గ్రామానికి చెందిన శ్రద్ధా ధావన్ పాల వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. రోజుకు ఏకంగా 450 లీటర్ల పాలను విక్రయిస్తున్నారు. శ్రద్ధా ధావన్ తండ్రి సత్యా ధావన్ ది పాల వ్యాపారం కాగా అతను పెద్దగా చదువుకోలేదు. అయితే పాల వ్యాపారం ద్వారా కుటుంబానికి ఏ లోటు లేకుండా సత్య ధావన్ చేసుకునేవారు.

అయితే పది సంవత్సరాల క్రితం సత్య ధావన్ అనారోగ్యం బారిన పడ్డారు. పాల వ్యాపారం చేతకాకపోవడంతో ఒక్క పశువును ఉంచుకుని మిగిలిన పశువులను అమ్మేశారు. ఫలితంగా పిల్లల చదువులు భారంగా మారాయి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో సత్య ధావన్ పాల వ్యాపారం బాధ్యతలను స్వీకరించాలని కూతురు శ్రద్ధా ధావన్ ను కోరగా ఆమె వెంటనే అందుకు అంగీకరించింది. 11 సంవత్సరాల వయస్సులో పశువుల కొట్టంలో అడుగుపెట్టిన ఆమె సైకిల్ తొక్కుతూ పాలను అమ్మేవారు.

ఆ తరువాత బైక్ ను నడపడం ప్రారంభించిన శ్రద్ధా ధావన్ బైక్ పై పాలను విక్రయించే మొదటి ఆడపిల్లగా గుర్తింపును సంపాదించుకున్నారు. అదే సమయంలో చదువు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రస్తుతం 80 పశువులతో పాల వ్యాపారం చేస్తున్నారు. పశువులకు సేంద్రీయ పద్ధతిలో పండించే గడ్డిని ఆమె ఆహారంగా ఇస్తున్నారు. పది సంవత్సరాల అనుభవంలో ఎన్నో మెలుకువలను నేర్చుకున్నానని ఆమె అన్నారు.

జీపు సహాయంతో 450 లీటర్ల పాలను డెయిరీ నుంచి ప్రస్తుతం విక్రయిస్తున్నామని ఆమె అన్నారు. నెలకు ఆరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నానని ఆమె తెలిపారు. యువత పాల వ్యాపారంలోకి అడుగు పెడితే ఎన్నో విజయాలను సొంతం చేసుకోవచ్చని అందరికీ ఈ రంగంపై అవగాహన కలిగే విధంగా ఆన్ లైన్ లో పలు సంస్థల తరపున అతిథిగా ప్రసంగిస్తున్నానని ఆమె అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here