MaheshBabu: మరోసారి వెకేషన్ కు సిద్ధమైన మహేష్… ఇలాగైతే గుంటూరు కారం అయినట్లే?

0
71

MaheshBabu:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా గత ఏడాది ప్రారంభమైనప్పటికీ ఇంకా షూటింగ్ పనులను 50 శాతం కూడా పూర్తి చేసుకోలేదు కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా సరికొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో మహేష్ బాబు పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. తాజ సమాచారం ప్రకారం మహేష్ బాబు మరోసారి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్ళబోతున్నారని తెలుస్తోంది.మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి తరచూ వెకేషన్ ప్లాన్ చేస్తూ ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆగస్టు మొదటి వారం ఈయన వెకేషన్ కోసం ఇతర దేశాలకు వెళ్ళబోతున్నారని తిరిగి రెండవ వారం పూర్తి అయిన తర్వాత ఇండియాకి చేరుకొనున్నారని తెలుస్తుంది. వెకేషన్ పూర్తి అయిన తర్వాతనే మహేష్ బాబు తిరిగి గుంటూరు కారం సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇలా మహేష్ తరచూ వెకేషన్ కి వెళ్తే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లేనని పలువురు భావిస్తున్నారు.

MaheshBabu: పుట్టినరోజు సందర్భంగా వెకేషన్ కి మహేష్ బాబు


మహేష్ బాబు ఆగస్టు 9వ తేదీ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తున్నారని తెలుస్తోంది. అయితే ఈయన లేకపోయినా గుంటూరు సినిమా షూటింగ్ ఏ మాత్రం ఆగిపోదని ఈయనతో సంబంధం లేనటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా ఈ సమయంలో చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది.అయితే మహేష్ బాబు ఈ వెకేషన్ కి వెళ్తే ఈ పుట్టినరోజుకు ఆయన అభిమానులకు అందుబాటులో ఉండరని సమాచారం.