మలేసియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్ రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత పోరుతో మెజారిటీని నిరూపించుకునే పక్షంలో.. ఆయన బలనిరూపణ లో విఫలమయ్యారు.దీంతో యాసీన్ రాజీనామా అనివార్యమైంది. కేబినెట్ రాజీనామాను అక్కడి రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లాకు సమర్పించినట్లు మంత్రి ఖైరీ జమాలుద్దీన్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. రాజును కలిసిన తరువాత ముహిద్దీన్ యాసిన్ రాజభవనాన్ని వీడినట్లు తెలిపారు.

కాగా యాసిన్ రాజీనామాతో ఆ దేశం మరింత ప్రమాదంలో పడింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం, కరోనాతో ఇబ్బందులతో సతమవుతున్న తరుణంలో ఆయన రాజీనామ వలన దేశంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరోవైపు తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


































